ఈ సంక్రాంతికి అందరి కళ్లూ… చిరు, బాలయ్యల సినిమాలపైనే. గౌతమిపుత్ర, ఖైదీ నెం.150 కోసం చిరు. బాలయ్యల ఫ్యాన్సే కాదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాల రైట్స్ కోసం బయ్యర్లు క్యూ కట్టారు. అన్ని ఏరికాయల నుంచీ.. రికార్డు స్థాయిలోనే రైట్స్ అమ్ముడుపోయాయి. వీటితో పోలిస్తే.. ఓవర్సీస్లో ఈ రెండు సినిమాలూ దక్కించుకొన్న సొమ్ము చాలా తక్కువనే చెప్పాలి. గౌతమి పుత్ర శాతకర్ణిని ఓవర్సీస్ లోరూ.4 కోట్లకే కొన్నారు. చిరు సినిమా అయితే…. రూ.10 కోట్లు పలికింది. నిజానికి ఓవర్సీస్ మార్కెట్, ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలు, సంక్రాంతి సీజన్.. వీటితో పోలిస్తే.. ఓవర్సీస్లో ఈ సినిమాలు దక్కించుకొన్నది తక్కువనే చెప్పాలి.
ఈమధ్య చిన్న సినిమాలకు క్రేజ్ ఉంటే చాలు కొనేయడానికి ఎగబడిపోతున్నారక్కడ. నాని సినిమా కి రూ.3 కోట్లకుపైగానే పలుకుతోంది. ఊరు పేరు తెలియని హీరో సినిమా అయినా, క్రేజ్ ఉందంటే.. కోట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అలాంటప్పుడు సీనియర్ హీరోలకు ఇంత తక్కువ స్థాయిలో సొమ్ములు రావడం ఆశ్చర్యకరమైన విషయమే. లెజెండ్ తప్ప బాలయ్య సినిమాలేవీ… ఓవర్సీస్లో హవా చూపించలేకపోయాయి. చిరు హీరోగా బిజీగా ఉన్నప్పుడు ఓవర్సీస్లో ఇంత మార్కెట్ లేదు. వీళ్లిద్దరినీ ఓవర్సీస్ లో ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే అనుమానాలు అక్కడి బయ్యర్లకున్నాయి. అందుకే ఊహించినదానికంటే తక్కువ రేట్లు పలికాయక్కడ. ఇద్దరితో పోలిస్తే… చిరు సినిమాకే భారీ రేటు గిట్టుబాటు అయినట్టు లెక్క! గౌతమి పుత్రకు ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ రావాలంటే 1 మిలియన్ క్లబ్లో చేరాల్సిందే. అదే ఖైదీ కి దక్కాలంటే 2 మిలియిన్ క్లబ్లో స్థానం దక్కించుకోవాలి. మరి ఆ ఫీట్ కి ఈ బడా హీరోలు ఎంత దగ్గరగా వెళ్తారో వేచి చూడాలి.