మెగా హీరోల్లో అల్లు అర్జున్‌కి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువే. తనకంటూ సెపరేట్‌గా ఓ పీఆర్ వర్గం ఉంది. బన్నీకి సంబంధించిన ప్రతీదీ… ఫేస్ బుక్‌లో, ట్విట్టర్లలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియలో విచ్చలవిడిగా వచ్చేల చూసుకొంటుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో బన్నీకి అత్యధిక పాపులరిటీ, ఫాలోయింగ్ ఉండడానికి కారణం.. ఈ పీఆర్లే! బన్నీ ఎకౌంట్లను ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తుంటారు. తాజాగా బన్నీరెండోసారి తండ్రయ్యాడు. తన పాపకి అర్హ అనే పేరు పెట్టాడు. బన్నీ తన అమ్మాయికి ఏం పేరు పెట్టాడన్నది బహుశా.. మెగా అభిమానులకు ఇంట్రస్టింగ్ వార్తే. కానీ.. అదేదో.. బన్నీ సినిమా ఫస్ట్ లుక్లానో, ట్రైలర్ రిలీజ్లానో, టైటిల్ ఎనౌన్స్ మెంట్లానో బన్నీ పీఆర్ హడావుడి చేసింది. ”సాయింత్రం 4 గంటలకు బన్నీ తనయ పేరు ప్రకటిస్తాం.. ఈ ఐటెమ్ కి వీలైనంత స్పేస్ ఇవ్వగలరు” అంటూ ఉదయాన్నే పీఆర్లు ప్రమోట్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. అంటే.. బన్నీ ఇంట్లో ఓ శుభకార్యం కూడా మీడియ దృష్టిలో ఐటెమ్‌లా మార్చేస్తున్నారన్నమాట.
ఇదేమైనా టైటిలా, ట్రైలరా సాయింత్రం 4 గంటలకు ఎనౌన్స్ చేయడానికి..?? ఇలా ముందస్తు సమాచారం గనుక మీడియాకు ఇవ్వకపోతే… ఈ ఐటెమ్ కవర్ అవ్వదు.. అని బన్నీ పీఆర్లు భయపడి ఉంటారు. తన కూతురికి ఏం పేరు పెట్టాలన్నది ముందే ఫిక్సయిపోయినా… 4 గంటల వరకూ ముహూర్తం కోసం దాచి ఉంచి ఉంటారు. అదేదో 4 తరవాతే ట్విట్టర్లోనో, ఫేస్ బుక్‌లోనో పోస్ట్ చేస్తే.. మీడియా, బన్నీ అభిమానులు చూసి తరిస్తారు కదా?? కానీ.. అలా కాకుండా అది కూడా సినిమా ఐటెమ్‌లా ట్రీట్ చేసి. అర్హ ఫస్ట్ లుక్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలన్న ఉత్సుకతని చూస్తుంటే… అల్లు ఫ్యామిలీకి పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌లోకి వెళ్లిపోయిందేమో అనిపిస్తోంది. ఆ ‘ఐటెమ్’కి మీడియా ఇచ్చిన ప్రాధాన్యం చూస్తున్నా జాలేస్తోంది. సెలబ్రెటీకి సంబంధించిన ఏదైనా మాకు న్యూసే అంటూ చంకలు గుద్దుకొంటూ ప్రచారం చేస్తోంది. దొందు దొందే!