జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా గురించి బోలెడన్ని వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, లింగుస్వామి, వినాయక్, పూరీ జగన్నాథ్ అంటూ చాలా మంది సీనియర్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్‌గా వాళ్ళందరినీ కాదని సర్దార్లాంటి డిజాస్టర్ ఇచ్చిన బాబీ లైన్లోకి వచ్చాడు. అంచనాలు ఆకాశంలో….వాస్తవం భూమిమీద అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అయితే ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని ప్లే చేయబోతున్నాడన్న న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ముగ్గురు ఎన్టీఆర్లకు తోడుగా ముగ్గురు హీరోయిన్స్….బోనస్‌గా ఐటెం పాప కూడా ఉంటుందన్న వార్తలు రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫైనల్ చేయడంతో మళ్ళీ అంచనాలు పెరిగాయి. ఒక హీరోయిన్గా శృతీ హాసన్ ఫైనల్ అయ్యే అవకాశముంది అని ఎన్టీఆర్ సన్నిహితులే చెప్పడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా చాలా ఆసక్తి కనిపించింది.
అంతా పాజిటివ్‌గా ఉంది. మొదటి సారి ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పైన సినిమాని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ ప్రశ్నే లేదని చెప్పాడు. తను హీరోగా చేసిన సినిమాలకు కూడా మార్కెట్‌ని మించే ఖర్చుపెట్టాడు కళ్యాణ్ రామ్. ఇక వరుసగా మూడు హిట్స్ కొట్టిన ఎన్టీఆర్…మూడు పాత్రల్లో కనిపించనున్న మాస్ ఎంటర్టైనర్ అంటే తగ్గుతాడా? ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్, నలుగురు హీరోయిన్స్, భారీ బడ్జెట్ లాంటి విషయాలన్నీ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చాయి కానీ ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు లీక్ చేస్తున్న సినిమా టైటిల్స్ మాత్రం మరీ బ్యాడ్‌గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఓల్డ్‌గా ఉన్నాయి. కంటెంట్ అండ్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా మెప్పించిన ఎన్టీఆర్‌కి ఇప్పుడున్న ఇమేజ్‌కి అస్సలు సూట్ అయ్యేలా లేవు. ‘నట విశ్వరూపం’, ‘త్రిమూర్తులు’లాంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు టైటిల్స్ కూడా ఎన్టీఆర్ సినిమాను ముంచేరకంగానే కనిపిస్తున్నాయి. త్రిమూర్తులు టైటిల్ అయితే మరీ బ్యాడ్‌గా ఉంది. మూడు క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాడు కాబట్టి యాప్ట్ అవుతుంది అనుకుంటున్నారేమో కానీ సౌండింగ్ అయితే మాత్రం అస్సలు బాలేదు. ‘సింహాద్రి’లాంటి టైటిల్ అనుకున్నా సింహాద్రిలో ఉన్న ఫోర్స్ త్రిమూర్తులులో అస్సలు లేదు. వాళ్ళకు బాగున్నాయి అని అనిపించిన టైటిల్స్ లీక్ చేయడం, అభిమానులు, ప్రేక్షకుల రియాక్షన్స్ చూసి డెసిషన్ తీసుకోవడంలాంటివి ఇప్పుడు కామన్‌గా జరుగుతున్నాయి. ఈ రెండు టైటిల్స్ విషయంలో కూడా మీడియావాళ్ళతో అభిమానులు కూడా నెగిటివ్‌గానే ఉన్నారు. మరి ఎన్టీఆర్-బాబీల ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో? ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాలి మరి.