అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో సమాజ్ వాదీ పార్టీ నిలువునా చీలిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తనయుడు అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు ములాయం సింగ్ యాదవ్. దీంతో అధికార పార్టీ నిలువునా చీలిపోయింది.
మొన్నటి వరకు బాబాయి అబ్బాయి మధ్య జరిగిన యుద్ధం చివరకు తండ్రీ తనయుల పోరాటంగా మారింది. ఇప్పుడు అసలైన పార్టీ ఎవరిది అనేది తేలాల్సి ఉంది. అఖిలేష్ రాజీనామా చెసేది లెదని ఆయన మరొ బాబాయి రాం గొపాల్ యాదవ్ తేల్చి చెప్పారు. అఖిలెష్ తో పాటు ఆయన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు.
కొత్త ముఖ్యమంత్రిని తానే నిర్ణయిస్తానని ములాయం ప్రకటించారు. దీంతో అఖిలేష్ పదవి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మెజారిటీ ఎం ఎల్ ఎ లు ఆయనకు మద్దతు తెలిపితే పదవిలో కొనసాగుతారు. లేకపోతే పదవిని కోల్పోక తప్పదు.
శనివారం ఉదయం అఖిలెష్ తన వర్గం ఎం ఎల్ ఎ లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎంతమంది హాజరవుతారు అనేది కీలకం. మెజారిటీ కి అవసరం అయినంత మంది హాజరైతె ఆయన గట్టెక్కినట్టే. అప్పుడు ములాయం తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ కావచ్చు.
అలాగే పార్తీ ఎం పి లలో ఎక్కువ బంది ఎవరి వైపు ఉన్నారనేది కూడా ముఖ్యమే. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలేష్ బలంగా కనిపిస్తున్నారని కొందరు పరిశీలకుల అభిప్రాయం. అదే నిజమయితే అప్పుదు ములాయం ప్రాభవం తగ్గవచ్చు. తమ్ముడి ఈగో కోసం తనయుడినే బహిష్కరించినందుకు మూల్యం చెల్లిస్తారా లేక పంతం నెగ్గించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.