మెగా హీరోల సినిమా ఈవెంట్‌కి పవన్ హాజరవడం అనేది మరీ ఎనిమిదో వింత అనే రేంజ్లో కనిపిస్తోంది మెగా అభిమానులకు. పవన్ కూడా మెగా హీరోనే అయినప్పటికీ నితిన్, సప్తగిరిలాంటి వాళ్ళ సినిమాలకు అయితే రెగ్యులర్‌గా అటెండ్ అవుతాడు కానీ అదేంటో మరి మెగా ఫంక్షన్ అనేసరికి మొహం చాటేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు ఫ్రస్ట్రేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇప్పుడు మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు అందరూ వెయిట్ చేస్తున్న ఫంక్షన్ అయితే వచ్చేసింది. ఖైదీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కి పవన్ హాజరవడం ఖాయమైంది. మెగా చాణక్యుడు అల్లు అరవిందే ఈ విషయాన్ని కన్ఫాం చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా హీరోలందరూ ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవడం ఖాయమే.
మిగిలిన హీరోల విషయం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు అనే విషయంపై మాత్రం రాజకీయ వర్గాల్లో కూడా క్యూరియాసిటీ ఉంటుందనడంలో సందేహం లేదు. గతంలో ఎన్టీఆర్ సినిమాల విషయంలో చేసినట్టుగానే ఇప్పుడు చిరంజీవి సినిమా విషయంలో కూడా తెలుగు దేశం పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని మెగా వర్గాలు అశిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’కి పొలిటికల్ అడ్డంకులున్నాయన్నది కంటికి కనిపిస్తున్న వాస్తవం. మరి ఇదే టిడిపికి 2014 ఎన్నికల్లో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఖైదీ ఫంక్షన్లో ఏం మాట్లాడతాడు? నాగబాబు, అల్లు అరవింద్‌ల మాటల్లో అయితే రాజకీయ ప్రెషర్ ఉందన్న విషయం అర్థమవుతోంది. మరి తెరవెనుక రాజకీయ కోణం గురించి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు స్పందిస్తారా? ఇప్పటి వరకూ ఏ మెగా హీరో ఫంక్షన్‌కి అటెండ్ అయినా కూడా అల్లు అర్జున్‌గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా? అనే వేలా ఎవరో హీరో ఫంక్షన్‌కి అటెండ్ అయినట్టుగా మాట్లాడే పవన్ ఇప్పుడు అన్నయ్య సినిమా కోసమైనా నితిన్ సినిమాల కోసం మాట్లాడినట్టుగా మాట్లాడతాడా? పవన్ హార్డ్ కోర్ అభిమానులకు కూడా విస్పష్టమైన సందేశం ఇస్తాడా? సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కి తరలిరావాలి అని మాట్లాడితే బాలకృష్ణ సినిమాల కోసం ఇతరుల సినిమాలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్తాడా? జరుగుతున్న పరిణామాలను చూస్తున్న మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై చాలా ఆగ్రహంగా స్పందిస్తున్నారు. మరి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు……మరీ ముఖ్యంగా పవన్ స్పీచ్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.