గతేడాది సమ్మర్లో సరైనోడు విడుదల చేసి సూపర్ సక్సెస్ కొట్టేశాడు అల్లు అర్జున్. ఈసారి కూడా వేసవిపైనే గురి పెట్టాడు. బన్నీ తదుపరి సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు ఫిక్సయినట్టు తెలుస్తోంది. మే 19న ఈ చిత్రాన్ని విడదుల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. నిజానికి ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకొన్నారు. అదే నెలలో బాహుబలి 2 విడుదల అవుతోంది. ఆ హవా తగ్గడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. అందుకే బాహుబలి వెళ్లాకే వద్దామని దువ్వాడ రిలీజ్ డేట్ కాస్త వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారం నాటికి సినిమాని పూర్తి చేస్తానని హరీష్ శంకర్ మాట ఇచ్చాడట. దిల్‌రాజు కూడా పక్క వ్యూహంతోనే ఈ సినిమాని ఫినిష్ చేస్తున్నట్టు టాక్. సమ్మర్ అయితే.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చని, దువ్వాడకు ముందూ వెనుకా పెద్ద సినిమాలేం లేకుండా చూసి, సోలో రిలీజ్ కోసమే ఆలోచించి ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్టు టాక్.
ప్రస్తుతం బన్నీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ఓ అగ్రహారం సెట్ వేశారు. అందులోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ యువకుడిగా, ఓ డైనమిక్ కుర్రాడిగా రెండు ఛాయలుంటాయట. ఈ సినిమా కోసం బన్నీ ముందస్తు కసరత్తు కూడా తీసుకొన్నాడు. ఇద్దరు బ్రాహ్మణకుర్రాళ్లని ఆఫీసుకు తీసుకొచ్చి.. వాళ్ల మాట తీరునీ, బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలించాడట. ఈ సినిమా అదుర్స్ని పోలి ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నా.. అటువంటిదేం లేదని ఇది నిజంగానే కొత్త కథని చిత్రబృందం వ్యాఖ్యానిస్తోంది.