‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’.. చిరంజీవి కోసం పరుచూరి బ్రదర్స్ రాసుకున్న కధ. అన్ని అనుకున్నట్లు జరిగుంటే చిరంజీవి150సినిమాగా ఈ చిత్రమే తెరకెక్కిండేది. అయితే ఎందుకు ఈ స్క్రిప్ట్ పక్కకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడీ కధ మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు చిరంజీవి. తన 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని దాదాపుగా ఖారారు చేసుకున్నారట మెగాస్టార్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరైతే బావుటుందని బాగా అలోచించిన చిరు.. ఇప్పుడు దర్శకుడి ఎంపిక కూడా పూర్తి చేశారని తెలిసింది. సురేందర్ రెడ్డిని ఆల్మోస్ట్ ఫైనల్ చేశారట చిరు. దీనిపై ఇప్పటికే సురేందర్ రెడ్డితో చర్చలు జరిపినట్లు టాక్.
ఇటివలే రామ్ చరణ్ కు ధ్రువ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ధ్రువ తర్వాత సురేందర్ రెడ్డి తో ఓ సినిమా చేస్తానని ఇటివలే ప్రకటించాడు చరణ్. ఇప్పుడా సినిమానే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’అని టాక్. ఇంకో విషయం ఏమిటంటే..సురేందర్ రెడ్డి దగ్గర ఆల్రెడీ ఓ కధ రెడీగావుంది. ఇది గనుక చిరంజీవికి నచ్చితే ఇదే స్టోరీతో సినిమా ఉటుంది. అలా కాని పక్షంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కధను సూరి డైరెక్ట్ చేస్తాడని టాక్. మొత్తంమ్మీద చిరంజీవి 151చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు ఖాయమైపొయినట్లే.