విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం వున్న చిత్రాలు తీయాలనుకున్న దర్శకులకు పెద్ద టార్గెట్ నే సెట్ చేశాడు రాజమౌళి. బాహుబలితో. ఈ సినిమాని ఓ విజువల్ వండర్ తీర్చిదిద్ది ప్రేక్షకులకు క్వాలిటీ విజువల్ ట్రీట్ రుచిచూపించాడు. ఇప్పుడు ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుందంటే ఆటోమేటిక్ గా బాహుబలితో కంపారిజన్స్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. ”రుద్రమదేవి” విషయంలో కూడా ఇదే జరిగింది. వాస్తవానికి బాహుబలికి ముందు ఈ సినిమా వచ్చివుంటే అద్భుతంగా అనిపించేదే. కానీ బాహుబలి క్వాలటీ విజువల్ వండర్ ని చూసిన ప్రేక్షకుడు అవే కళ్ళతో రుద్రమదేవిని చూసే సరికి తెలిపోయినట్లయింది. ఇప్పుడు క్రిష్ భయం కూడా ఇదే.
బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకుడు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆదరంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరి కొద్ది గంటలో ఈ సినిమా థియేటర్ లోకి వస్తుంది. ఈ చిత్రంపై పూర్తి కాన్ఫిడెంట్ గా వుంది యూనిట్. అయితే ఓ టెన్షన్ మాత్రం వెంటాడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండే ‘బాహుబలి’తో పోలిక వచ్చేసింది. ఇదీ పిరియడికల్ చిత్రం కావడం, భారీ యుద్దలు వుండడం, దాదాపు సినిమాలో గంటకాలం పాటు యుద్ధ సన్నివేశాలు నడుస్తాయని చెప్పడంతో ప్రేక్షకులు మళ్ళీ బాహుబలి ఫాంటసీ లోకి వెళ్ళిపోయారు.
అయితే దర్శకుడు క్రిష్ మాత్రం రెండింటికీ పోలిక లేదని చెబుతున్నారు. ”’బాహుబలి’ ఓ ఫాంటసీ. శాతకర్ణి ఓ చక్రవర్తి చరిత్ర. రెండిటికీ సాపత్యం అనవసరం. ఇంకా చెప్పాలంటే శాతకర్ణి విజువల్ ఎఫెక్ట్ జోనర్ సినిమా కాదు. దిన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా తీశాను. ఇది ఎమోషన్ మీద నడిచే కధ”అని క్లారిటీ గా చెప్పుకొచ్చారు.
అయితే ప్రేక్షకులు, అభిమానులు మాత్రం విజువల్ వండర్ ని ద్రుష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడో చిన్న టెన్షన్ వుంది. మరి చూడాలి.. ప్రేక్షకుల విజువల్ వండర్ అంచనాలను క్రిష్ తన ఎమోషనల్ టచ్ తో డామినేట్ చేస్తారో? లేదా విజువల్ అంచనాల దగ్గర ప్రేక్షకుడికి దొరికిపోతారో? మరి కొద్ది గంటల్లోనే ఫలితం తేలిపోద్ది.