దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ బహిరంగ లేఖ రాశారు. తన ప్రతిష్టాత్మక ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఈ లేఖ ద్వారా మరోసారు విజ్ఞప్తి చేశారు. నందమూరి బాలకృష్ణ తాజగా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆదరంగా చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 12న ఈ చిత్రం ప్రేక్షుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వారం క్రితమే తెలంగాణ ప్రభుత్వం వినోదపన్ను పన్ను మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెబుతున్న చరిత్రను వెండితెరపై ఆవిష్కారిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈనేపధ్యంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి ఏపీలో పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, తన స్వీయ దర్శకత్వంలో రూపుందించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు గుణశేఖర్.
గత ఏడాది తానూ కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితం పై స్టీరియోస్కోపిక్ 3డి వంటి అత్యున్నత సాంకేతికను ఉపయోగించి, ఎంతో వ్యయప్రయాసలతో ఓ మహా వీరనారి చరిత్రను తెరపై ఆవిష్కారించానని, దీనికి పన్ను రాయితీ ఇవ్వాల్సిందిగా ఏపీ, తెలంగాణా ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేయగా, తెలంగాణా ప్రభుత్వం వెంటనే పన్ను రాయితీ ఇచ్చిందని, అయితే ఏపీ ప్రభుత్వం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా రాయితీపై కమిటీ ఏర్పాటు చేసి చివరి ఫైల్ మూసేసిందని లేఖలో పేర్కొన్నారు గుణశేఖర్. రుద్రమదేవి అంటే కేలవం తెలంగాణ ప్రాంత చరిత్రమాత్రమే కాదని, ఆ వీరనారి యావత్ దక్షిణ భారతంపై ప్రభావం చూపారని, ఆమె పట్టాభిషేకం ఆంధ్రప్రదేశ్, అమరావతిలోని మార్కపురం వద్ద జరిగిందని లేఖలో గుర్తు చేశారు. స్త్రీ సాధికారతను ప్రపంచానికి చాటిన రుద్రమదేవి వంటి గొప్ప వీరనారిపై తీసిన తన చిత్రానికి వసూలు చేసిన పన్నును ”ప్రోత్సాహక నగదు బహుమతి’ రూపంలో తిరిగిస్తే నిర్మాతగా తనకు కాస్త ఉపశమనంగా ఉంటుందని ఈ లేఖలో కోరారు గుణశేఖర్.
నిజమే.. గుణశేఖర్ ఆవేదనలో అర్ధం వుంది. ‘రుద్రమదేవి’ కో న్యాయం.. ‘శాతకర్ణి’ కో న్యాయం వుండకూడదు కదా. ఈ విషయంలో అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ద్రురమదేవి కేలవం తెలంగాణకు చెందిన చరిత్ర కాదు కదా.? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఈ మేరకు ప్రోత్సాహం కల్పించలేదు అనే ధర్మ సందేహాలు వచ్చాయి. ఇప్పుడు’శాతకర్ణి’కి మినహాయింపు కల్పించడంతో మరోసారి తన విన్నపాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చారు గుణశేఖర్. మరి, గుణశేఖర్ విన్నపం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే దీనికి ఖచ్చితంగా దీనిపై అధికారులతో వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. రుద్రమదేవికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేకపోయారు, ఎలాంటి శాంకేతిక అంశాలు అడ్దోచ్చాయో చెప్పాల్సివుంది. లేదంటే శాతకర్ణి హీరో బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు భందువు గనక మినహాయింపు ఇచ్చుకున్నారు అనే అపవాదు మోయాల్సివస్తుంది.