సినిమా వాళ్ళంతే. ఒకరితో ఒకరు అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ లోతుగా పరిశీలిస్తే అన్నీ విభేదాలే కనిపిస్తూ ఉంటాయి. ఖైదీ నంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి తమ్ముడు నాగబాబు ఏ రేంజ్లో రెచ్చిపోయాడో చూశారుగా. అన్నయ్య చిరంజీవిని విమర్శించిన వాళ్ళను ఏకిపారేసే బాధ్యతను ఇప్పుడు నాగబాబుకు అప్పగించినట్టున్నగా ఉన్నారు కానీ ఓ దశాబ్ధం క్రితం మాత్రం ఆ బాధ్యతను చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ భుజాలపైన ఉంచాడు చిరంజీవి. పవన్ కళ్యాణ్ కూడా తనకంటే సీనియర్ నటుడు, చిరంజీవికి సమకాలీనుడు అనే స్పృహ లేకుండా మోహన్బాబుపైకి ఒంటికాలి మీద లేచాడు. తన స్టైల్లో ఆవేశపడిపోయి మోహన్‌బాబుని ‘తమ్ముడూ..’ అని పిలుస్తూ చీల్చి చెండాడేశాడు. ఆ తర్వాత కాలంలో మోహన్‌బాబు, పవన్‌లు వివిధ కార్యక్రమాల్లో కలిశారు గానీ మెగా-మంచు ఫ్యామిలీల మధ్య కౌంటర్-ఎన్కౌంటర్ డైలాగ్ వార్ మాత్రం సినిమాలలోనూ, ఆడియో ఫంక్షన్లలోనూ ఇండైరెక్ట్‌గా కంటిన్యూ అవుతోంది.
తాజాగా లక్కున్నోడు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చాడు మోహన్‌బాబు. అయితే ఆ వార్నింగ్ డైలాగ్స్ అన్నీ కూడా విష్ణుకంటే కూడా పవన్ కళ్యాణ్‌కి బాగా తగిలేలా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ‘నేను సహజంగా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌కి వెళ్ళను అని చెప్పడం తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కి నువ్వు వెళ్ళాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్స్‌కి కూడా నువ్వు తప్పకుండా హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినప్పుడు తప్పక వెళ్ళాలి. నేను ఎక్కడికీ వెళ్ళనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టుకోవద్దు…..అర్థమైందా….డబ్బాలు వద్దు మనకు….సిన్సియర్‌గా ఉండు……’ ఇదీ విష్ణుకు మోహన్‌బాబు ఇచ్చిన వార్నింగ్. డైలాగ్ కింగ్‌గారు చెప్పిన డైలాగులన్నీ విష్ణుకు చెప్తున్నట్టుగానే చెప్పాడు కానీ కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టుకోవద్దు, నా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌కి కూడా నాకు వెళ్ళడం ఇష్టం ఉండదు. సినిమా ఫంక్షన్స్‌కి వెళ్ళను అని చెప్పే బిల్డప్పులు వద్దు అని చెప్పిన మాటలన్నీ కూడా పవన్‌కే ఎక్కువ తగులుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ‘తమ్ముడూ….’ అంటూ పవన్ పేల్చిన డైలాగులను మోహన్‌బాబు అప్పుడప్పుడే మర్చిపోయి ఉంటాడనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. మరి పవన్‌కి కౌంటర్ ఇవ్వడం కోసమే విష్ణును అడ్డుపెట్టుకుని డైలాగులు పేల్చాడన్న మాటలు కూడా కరెక్టే అనిపిస్తోంది. ఏది ఏమైనా బిల్డప్పులు వద్దు….సిన్సియర్‌గా ఉండండి అని మోహన్‌బాబు చెప్పిన డైలాగులతో మాత్రం చాలా మంది ఏకీభవిస్తున్నారు. బిల్డప్పులు, పొగడ్తలు లేకుండా మన తెలుగు హీరోలను చూడగలమంటారా? తెలుగు హీరో అంటేనే బిల్డప్పుల ఖజానా, స్వీయ పొగడ్తల వర్షానికి కేర్ ఆఫ్ అడ్రస్ కదా……