చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలాంటి కథతో రాబోతుంది? ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? లాంటి అనేక అంశాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీటన్నింటితో పాటు….ఈ అంశాల కంటే ఎక్కువగా కూడా చర్చకు వచ్చిన అంశాలు పవన్ కళ్యాణ్‌కి సంబంధించినవే. చిరంజీవి సినిమాలో పవన్ కనిపిస్తాడా? చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినప్పటికీ పవన్ ఎందుకు రాలేదు? ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి ఎందుకు రాలేదులాంటి ఎన్నో ప్రశ్నలు విపరీతంగా చర్చకు వచ్చాయి.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకూ చిరంజీవి సినిమాకు సంబంధించి పెద్దగా స్పందించింది లేదు. ప్రి రిలీజ్ ఫంక్షన్ రోజు మాత్రం వదినమ్మ సురేఖకు విషెస్ చెప్పాడు. మరి ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన తర్వాత పవన్ స్పందన ఏంటి? అసలు ఆ సినిమాను పవన్ చూశాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది.
ప్రి రిలీజ్ ఫంక్షన్ రోజు కూడా పవన్ మాటలన్నీ ట్విట్టర్లో ఒక పోస్ట్‌కి పరిమితమైతే , పవన్ సన్నిహితుడు శరత్ మరార్ మాత్రం ఆ ఫంక్షన్‌కి అటెండ్ అయి పవన్ మాటలను తన మాటలుగా చెప్పేశాడు. ఇప్పుడు సినిమా చూసాక కూడా , తను స్వయంగా స్పందిచాల్సినంత పెద్ధ విషయం కాదు అనుకున్నారేమో పవన్ స్పందించకుండా , శరత్ మరార్ చేత స్పందన ఏంటి అనే విషయాన్ని చెప్పించాడు. “చిరంజీవి సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎంజాయ్ చేశాడని….అలాగే 150వ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టిన చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందించాడని” శరత్ మరార్ తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.
కనీసం శరత్ మరార్ మాటల్లో అయినా పవన్ స్పందన తెలిపినందుకు మెగాభిమానులకు సంతోషమే కానీ..అదేదో పవన్ కళ్యాణే స్వయంగా చెప్పి ఉంటే రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉండేదేమో…..ఏమంటారు?