నందమూరి బాలకృష్ణను ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’గా చూపించారు దర్శకుడు క్రిష్. చాలా పెద్ద స్కేల్ సినిమాని, చాల తక్కువ పనిదినాల్లో (78రోజులు) పూర్తి చేసి వావ్ అనిపించారు. భారీ యుద్ధాలు, వందలమంది సైనికులు, ఫారిన్ లోకేషన్స్, శాతకర్ణి సామ్రాజ్యం.. ఇలా చాల పెద్ద వర్క్ వుండే ఈ సినిమాని అన్ని తక్కువ రోజుల్లో పూర్తి చేయడం చర్చనీయాంశమైయింది. ఈ క్రమంలో ఎవరో ఓ విచిత్రమైన గాసిప్ ను పుట్టించారు. అదేంటంటే.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ,క్రిష్ కు స్నేహితుడు. బన్సాలీ ఈ తరహా బ్యాక్ డ్రాప్ లో ‘బాజీరావు మస్తానీ” చిత్రాన్ని తీశాడు. అయితే ఈ సినిమాలో వాడని కొన్ని వార్ సీన్స్ ను క్రిష్ కొంత డబ్బులు చెల్లించి తీసుకున్నారని, వాటిని శాతకర్ణి లో తెలివిగా ఎడిట్ చేశారని, అందుకే అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలిగారని ఓ గాసిప్ పుట్టించారు. ఇది క్రిష్ వరకూ వెళ్ళింది. ఈ గాసిప్ ఆయన చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చారు.
”నిజంగా చాలా దారుణమైన రాతలివి. కనీసం ఇంగితం లేకుండా ఇలాంటివి రాస్తున్నారు. వాళ్లకి వాళ్ళే గౌరవాన్ని పోగుట్టుకుంటున్నారు. అయినా ఇంత దారుణంగా ఎలా రాస్తారో అర్ధం కాదు.?! సంజయ్ నా ఫ్రెండ్. గ్రేట్ ఫిల్మ్ మేకర్. అది భేస్ చేసుకొని ఇలా ఉహించి రాసేస్తారా?. అసలు రాసినవాళ్ళకి సినిమా పరిజ్ఞానం వుందా. ‘బాజీరావు మస్తానీ’ ఒక మూడ్ లో నడిచే సినిమా. శాతకర్ణిది మరో మూడ్. అసలు ఎక్కడైనా సంబధం వుందా?! ఇదంతా కాదు. నా గురించి ఏం మనుకున్నారు? గమ్యం నుండి నన్ను చూస్తున్నారు. నా ప్రయత్నం ఏమిటో, సినిమా పై నాకున్న ప్యాషన్ ఏమిటో తెలియదా? ఎవరో తీసిన సినిమాని నా సినిమాలో వాడుకుంటానా? నాకు ఆ మాత్రం తీయడం రాదా? అసలు ఇంత తక్కువ టైం లో ఎలా చేయగలిగారు అనే ప్రశ్న నాకు అడగాల్సింది. దానికి సమాధానం చెప్పేవాడని. అంతే కానీ అసలు ఎలాంటి పరిజ్ఞామం లేకుండా ఇలా పిచ్చిపిచ్చి రాతలు రాయడం కరెక్ట్ కాదు” అంటూ ఒక్కింత ఆవేశం , వేదన వ్యక్తం చేశారు క్రిష్.