‘ఖైదీ నెంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. అభిమానులకు ఈ సినిమా పండగా భోజనం పెట్టేసింది. అటు కమర్షియల్ గా కూడా వర్క్ అవుట్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత 151 ని కూడా ఫిక్స్ చేశారు మెగాస్టార్. సురేందర్ రెడ్డితో చర్చలు జరిపారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కధను తెరకెక్కించాలి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుండి సురేందర్ రెడ్డి డ్రాప్ అయ్యే ఛాన్సలు కనిపిస్తున్నాయి. దిని వెనుక బాలకృష్ణ గౌతమీపుత్ర ఎఫెక్ట్ వుందని టాక్.
మేటర్ లోకి వెళితే.. సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగాస్టార్.. తన అభిమానుల కోసం మాసు, గ్రేసు ..అనే ఎలిమెంట్స్ ను భేస్ చేసుకొని వస్తే.. బాలయ్య మాత్రం ఓ గొప్ప సినిమా చూపించాలని, తెలుగు జాతి కధ చెప్పాలనే ఉద్దేశంతో శాతకర్ణి తీశారు. ఇప్పుడు అప్లాజ్ కూడా అలానే వుంది. చిరు అభిమానులకు పరిమితం అయిపోతే.. బాలయ్య సినిమా మాత్రం యావత్ తెలుగు జాతి మన్ననలను అందుకుంది. ప్రపంచం నలుమూలాలవున్న తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని చూసి మంచి సినిమా తీశారని ప్రసంశల జల్లు కురిపించారు.
ఇప్పుడు ఇదే చిరంజీవిని డైలామాలోకి నెట్టేసింది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ రెడ్డి కధకి కూడా ఇలాంటి గొప్ప లక్షణాలు వున్నాయి. 151 గా ఈ కధనే చేయాలని అనుకుంటున్నారు చిరు. సురేందర్ రెడ్డి మాత్రం తన తగ్గర ఉన్న ఓ కమర్షియల్ సబ్జెక్టు ఓకే చేయించాలని భావిస్తున్నాడట. మొదట మెగాస్టార్ కూడా సూరి సబ్జెక్టు పై కూడా ఆసక్తికరబరిచారు. అయితే శాతకర్ణి వచ్చిన తర్వాత ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనే అభిప్రాయానికి వచ్చారట. దీంతో సురేందర్ రెడ్డి పక్కకు జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చిరు దగ్గర వున్న మరో ఆప్షన్ క్రిష్. ఇప్పటికే 151 కోసం క్రిష్ తో చర్చలు జరిపారు చిరు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లాంటి సబ్జెక్ట్స్ ను క్రిష్ బాగానే డీల్ చేస్తారు. ఈ నమ్మకం చిరుకూ వుంది. దీంతో పాటు క్రిష్ దగ్గరా ఓ కధ వుందట. దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తంమ్మీద ఖైదీ 150 తర్వాత కూడా మాస్ జపం చేయాలనుకున్న మెగాస్టార్ ను డైలామాలోకి నెట్టేసింది శాతకర్ణి.