నోట్ల రద్దు నిర్ణయం తర్వాత పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినప్పటికీ ఎక్కువ మంది ప్రజలు సంయమనం కోల్పోలేదు. అదంత తన ఘనతే, తనపైన ఉన్న నమ్మకమే అని మోడీ చెప్పుకున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికక్కడ వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కుంటూ ఉంది…..తనపైన నమ్మకంతో ప్రజలే స్వచ్ఛంధంగా ఇస్తున్నారని చంద్రబాబునాయుడు చెప్పుకుంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరి ఘనతల గురించి కొత్తగా మాట్లాడునేది ఏం ఉంది కానీ ఆ క్రెడిట్ మొత్తం కూడా మన పోలీసులకు ఇవ్వాలన్న మాట మాత్రం వాస్తవం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలానే ఆ రాష్ట్ర డిజిపి సాంబశివరావు కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ప్రజలకు ఎన్నో సుద్దులు చెప్తూ ఉంటారు. ఆయన మాటలను టిడిపి అనుకూల మీడియా చెవులతో విన్నప్పుడు మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం నాలుగు పాదాలా నడుస్తుందేమోనని అనిపిస్తోంది. కానీ క్రైమ్ రేట్ డేటాలు మాత్రం భయం గొలిపేలా ఉన్నాయి. రివాల్వర్ కల్చర్ కూడా బాగానే డెవలప్ అవుతోంది. మాటలకు…చేతలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు……..
సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన వాళ్ళపై 1347 కేసులు నమోడు చేశామని డిజిపి సాంబశివరావు స్వయంగా చెప్పారు. అంటే జెసీ దివాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజులాంటి అధికార పార్టీ నేతలతో పాటు ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులందరిపైనా కేసులు బక్కయిపోయినట్టే అని అనుకుంటున్నారా? అలా జరిగి ఉంటే అప్పుడు నిజంగా చంద్రబాబు, డిజిపిలు చెప్పే మాటలను ఎంతైనా నమ్మొచ్చు. కానీ ఆ అరెస్ట్ చేసినవాళ్ళందరూ టివి కెమేరాల్లో లైవ్ టెలికాస్ట్ రిలే అవుతుండగా ….‘మా ఇష్టం….ఇది మా రాజ్యం……ఏం పీక్కుంటారో పీక్కోండి…..మేం కోడిపందేలు నిర్వహిస్తున్నాం…….’ అన్న రేంజ్లో కోడిపందేల దగ్గర హల్చల్ చేసిన టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ పందేలలో పాల్గొన్న సామాన్య జనాలే అనడంలో సందేహం లేదు. ఓటుకు నోటు కేసుతోనే చట్టం ఎవరకి చుట్టం అన్న విషయం జనాలకు బాగా అర్థమైంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. టిడిపి ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పబ్లిక్‌గా, న్యూస్ ఛానల్ లైవ్‌లో కోడి పందేలు నిర్వహిస్తే వాళ్ళపైన కేసులు లేవు. వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టలేదు అని అడిగే నాథుడు కూడా లేడు. చట్టసభల్లో ఉండేవాళ్ళకు వాటిపైన ఏ పాటి గౌరవం ఉందో ప్రజలందరికీ ససాక్ష్యంగా తెలిసిపోయింది. క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే రేంజ్లో చంద్రబాబు చెప్పుకుంటూ ఉండే టిడిపి నాయకులే రూల్స్ ఫాలో అవకపోతే దిక్కులేదు కానీ ఎన్ఆర్ఐలు మాత్రం అమెరికా, సింగపూర్లలో కూడా రూల్స్ ఫాలో అవకుండా ఆ ధేశాలను నాశనం చేయగలరని చంద్రబాబు మాట్లాడేస్తూ ఉంటాడు. కోడి పందేలలో పాల్గొన్న ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి చంద్రబాబు ఏం చెప్తాడు? వాళ్ళనెందుకు అరెస్ట్ చేయలేదు అన్న ప్రశ్నకు ‘చట్టం వాళ్ళ చుట్టం’ అన్న అందరికీ తెలిసిన సమాధానం కాకుండా డిజిపి దగ్గర వేరే ఆన్సర్ ఉందా?