ఖైదీ నెంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు రెండూ కూడా వేరు వేరు టైమ్స్‌లో రిలీజ్ అయి ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చి ఉండేదా? సినిమాను కచ్చితంగా చూడాల్సిందే….హిట్ చెయ్యాల్సిందే అనే రేంజ్‌లో పూనకాలు తెచ్చుకునేవారా? ఇద్దరు టాప్ రేంజ్ హీరోల వందవ సినిమా, 150వ సినిమాలు కాబట్టి కచ్చితంగా మంచి క్రేజే వచ్చి ఉండేది కానీ ఈ రేంజ్‌లో అయితే కాదు. రెండు సినిమాల రిలీజ్ కూడా ఒకేసారి ఉండబట్టే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బీభత్సమైన ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. సినిమా ఓపెనింగ్స్‌ని ఓ రేంజ్‌లో ప్రభావితం చేసింది. ఇప్పుడు ఈ విషయంపైనే ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి.సినిమా లైఫ్ కేవలం రెండు వారాలకే పరిమితమైన నేపథ్యంలో రిలీజ్ డేట్ నుంచే కలెక్షన్స్ సునామీ స్టార్ట్ అవ్వాలి. అంటే సూపర్ డూపర్ క్రేజ్ క్రియేట్ అవుతూ ఉండాలి. అలా జరగాలంటే మాత్రం సోలో రిలీజ్‌ల కంటే కూడా రెండు పెద్ద బడ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితేనే సూపర్ బజ్ క్రియేట్ అవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వరుసగా చాలా సార్లు ఇలాంటి రిలీజ్‌లు పడ్డాక ఆ క్రేజ్ తగ్గొచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఫ్యాన్స్ పుణ్యమాని పోరు కూడా లాభదాయకంగానే ఉంటోంది.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలను కూడా ఒకేసారి రిలీజ్ చేస్తేనే రెండు సినిమాలు కూడా కలెక్షన్స్ కుమ్మేస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు. బాహుబలి-2 సినిమాతో క్లాష్ రాకుండా ప్లాన్ చేసుకుని ….పవన్, మహేష్‌ల సినిమాలు ఒకేసారి రిలీజ్‌కి రెడీ అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్ వరకూ మరోసారి కలెక్షన్స్ మోత మోగిపోవడం ఖాయమే. తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న మహేష్-మురుగదాస్‌ల సినిమాకు రెండు భాషల్లోనూ కాంపిటీషన్ లేకుండా ఉండేలా…..మంచి డేట్‌కి రిలీజ్ చేయడం అంటే పాజిబుల్ అయ్యే విషయం కాదు. అందుకే పవన్ సినిమాతో పాటే రిలీజ్ చేయాల్సి వచ్చినా కూడా రెడీ అనేలా ఉన్నారని తెలుస్తోంది. సర్దార్ సినిమాతో దెబ్బతిన్న పవన్ కూడా ….పవన్ కళ్యాణ్ సినిమా అన్న ఒక్క క్రేజ్ మినహా కథ, డైరెక్టర్‌తో పాటు వేరే ఏ టెక్నీషియన్ విషయంలో కూడా హైలైట్స్ అంటూ ఏమీ లేకుండా వస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాని మహేష్ సినిమాకు కాంపిటీషన్‌గా వదిలితేనే సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ అవుతుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు వరకూ రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడమంటే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ కూడా కాస్త వెనుకాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోరు కూడా లాభదాయకంగానే ఉంటోందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో…..పవన్, మహేష్‌లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు….మరో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫైట్‌కి తెరలేచినట్టే.