నయనతార.. ఇప్పటికీ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అటు సినీయర్లకు ఇటు జూనీయర్లకు సరిపడే గ్లామర్ అమెది. ఎప్పుడో థర్టీప్లస్ దాటేసినా ఆమె క్రేజు ఇంకా తగ్గలేదు. తమిళ్ లో ఓ పెద్ద సినిమా మొదలైతే ముందు నయన్ డేట్స్ ను చెక్ చేస్తారని టాక్. ఆమె తర్వాతే సెకెండ్ ఛాయిస్ కి వెళ్తారట. అంతలా వుంది ఆమె క్రేజు. కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు, ప్రేమ వైఫల్యాలు చూసిన నయన్.. క్రేజ్ విషయంలో మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.
నయనతార క్యారెక్టర్ కూడా డిఫరెంటే. ఆమెతో సినిమా అంటే చాలా కండీషన్లు వినాలి. ఆమె సినిమా ప్రమోషన్స్ కి రాదు. ”ఆడియో వేడుకలకు , మీడియా మీట్లకు నన్ను పిలవకండి. నేను రాను” అని ముందే చెప్పేస్తుందామే. అప్పుడప్పుడు కనిపిస్తుంది. అదీ ఆమెకు నచ్చితేనే. మరో కండీషన్. తను ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ ఫినిష్ చేసుకోవాలి. అలా కాదు కొంచెం తేడా వచ్చినా.. నిర్మాతకు చుక్కలే. మొన్న వెంకీ బాబు బంగారానికి కూడా నరకం చూపించిందని టాక్.
ఇలా బోలెడు కండీషన్స్ తో సినిమాలు చేసే నయన ఇప్పుడు తాజగా ఇంకొన్ని కండీషన్లు నిర్మాతలు, దర్శకుల ముందు వుంచిదట. ”ఇక బికినీలు వేయను. లిప్ లాకులు గురించి అయితే నాదగ్గరకు రావద్దు. కధ మొత్తం చెప్పాలి. తన డైలాగులతో సహా. కధతో సంబధం లేని రొమాంటిక్ ట్రాకులు కుదరవు”.. ఇలా షరతుల చిట్టా విప్పిందట నయన్. అయితే నయన ఇప్పుడు కొత్త చెబుతున్న ఈ షరతుల వెనుక అత్తగారి ప్రభావం వుందట. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో లివింగ్ రిలేషన్ లో వుందనేది ఓపెన్ సీక్రెట్. వారి ఇరు కుటుంబాలకు ఈ సంగతి తెలుసు. త్వరలోనే పెళ్లి కూడా ప్లాన్ చేస్తున్నారు. విగ్నేష్ శివన్ తల్లి,. వృత్తి రిత్యా మంచి పలుకుబడి వున్న పోలీస్ బాస్. ఇప్పుడు ఆమెనే ఇకపై సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వుంటే మంచిదని నయన్ కు ఓ సూచన చేసిందట. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతుంది నయన.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇలా ఎన్ని కండీషన్లు పెడుతున్నా.. నయనతారనే కావాలనుకుంటున్నారు నిర్మాతలు, దర్శకులు,హీరోలు. ఆమె డేట్స్ దొరికితే చాలు అనుకునే నిర్మాతలు పదుల సంఖ్యలో లైన్ లో ఉన్నారట. పీక్స్ అంటారు కదా. అలాంటి పీక్స్ లోనే వుందనుకోవాలి నయనతార క్రేజిప్పుడు.