ఎన్టీఆర్ – దేవిశ్రీ ప్రసాద్…. ఓ సూపర్ హిట్ కాంబినేషన్. అదుర్స్ నుంచి జనతా గ్యారేజ్ వరకూ వీళ్లిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ పాటలొచ్చాయి. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ విజయాల్లో దేవి వాటా కూడా ఎక్కువే. అందుకే ఎన్టీఆర్ మరోసారి దేవిశ్రీ ప్రసాద్‌నే నమ్మకొన్నాడు. ఎన్టీఆర్ – బాబి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఫిబ్రవరి 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. సంగీత బాధ్యతలు దేవికి అప్పగించినట్టు టాక్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఎన్టీఆర్ కోసం ముగ్గురు హీరోయిన్లు కావాలి. కాజల్, తమన్నా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్… ఇలా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఓ కథానాయిక కాల్షీట్లు ఏకంగా 60 రోజుల పాటు కావాలట. అందుకే లాటుగా కాల్షీట్లు ఎవరిస్తారా అంటూ.. చిత్రబృందం అన్వేషణ ప్రారభించింది. తమన్నా, కాజల్‌లకు చేతిలో పెద్దగా సినిమాల్లేవు. కాబట్టి వీరిద్దరిలో ఒకరికి ప్లేసు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దసరా నాటికి ఈ చిత్రాన్ని రెడీ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఎందుకంటే ఆగస్టులో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మొదలెట్టేయాలి. అందుకే బాబి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. ఓ వారంలో కథానాయికలెవరనేది తేలిపోతుంది.