గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఒక ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఆదివారంనాడు ఒక స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసేందుకు వెళ్లి బైక్ ని టెస్ట్ రైడ్ చేస్తున్న సమయంలో క్రింద పడ్డారు. తక్షణమే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఆయన వెన్నెముకకు లోతుగా గాయం అయినట్లు సమాచారం. దాని కోసం ఈరోజు వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయవచ్చని తెలుస్తోంది. కానీ అదేమీ పెద్ద సమస్య కాదని త్వరలోనే ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి కాళ్ళకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. తెదేపా యువనేత నారా లోకేష్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి జయదేవ్ ని పరామర్శించారు. సాధారణ బైక్స్ కి స్పోర్ట్స్ బైక్స్ పికప్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. బహుశః అది తెలియకనే దానిని నడిపే ప్రయత్నంలో జయదేవ్ ఈ ప్రమాదానికిగురయి ఉండవచ్చును.