వంశీ – రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ‘లేడీస్ టైలర్’ సూపర్ హిట్. రొమాంటిక్ కామెడీ జానర్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన చిత్రమిది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తారు. ఇప్పుడీ సినిమాకి ‘ఫ్యాషన్ డిజైనర్’ టైటిల్ తో సీక్వల్ చేస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మాణంలో సుమంత్ అశ్విన్ హీరోగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా వెనుక పెద్ద కధే నడిచింది. ఈ సీక్వెల్ కి మొదట తనికెళ్ళ భరణి కధ రాశారు. రవితేజ ఓకే చేశాడు. అయితే ఎందుకో రవితేజ డ్రాప్ అయ్యాడు.
అయితే ఈ గ్యాప్ లో మధుర శ్రీధర్ ఆ స్క్రిప్ట్ ను చేజిక్కించుకొన్నారు. రవితేజ ఓకే చేసిన స్క్రిప్ట్ అనే నమ్మకంతో. దీని కోసం రాజ్ తరుణ్ కు అడ్వాన్స్ ఇచ్చారాయన. తీరా స్క్రిప్ట్ చదివితే.. అది రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ కాలేదనిపించిందట. దాంతో స్క్రిప్ట్ ను పక్కన పెట్టేసిన మధుర శ్రీధర్.. బివిఎస్ రవితో మరో స్క్రిప్ట్ రాయించారు. ఇది కుదిరింది. అయితే ఈ సమయంలో రాజ్ తరుణ్ హ్యాండ్ ఇచ్చాడట. మామూలు ఇబ్బంది పెట్టలేదట.
ఈ ఎపిసోడ్ గురించి స్వయంగా నిర్మాత మధుర శ్రీధరే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. నా జీవితంలో ఎవరికీ అడ్వాన్స్ ఇవ్వలేదు. అయితే ఫ్యాషన్ డిజనైర్ కోసం రాజ్ తరుణ్ కి అడ్వాన్స్ ఇచ్చాను. అదే నేను చేసిన తప్పు అనిపిస్తుంది. ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్ వెంట వెళుతుంది. ఒక్క సినిమా హిట్ అయితే మరో రేంజ్ లో రెమ్యునిరేషన్ అడుగుతారు. ముందు మనం మాట్లాడుకున్నదాన్ని పట్టించుకోరు. ఇది చాలా దారుణం. రాజ్ తరుణ్ తో వచ్చిన మరో ఇబ్బంది ఏమిటంటే.. కమ్యునికేషన్ లేకపోవడం. చేసేద్దాం అంటాడు కానీ క్లారిటీ వుండదు. అడ్వాన్స్ తీసుకున్నప్పుడు చూపించిన ఇంట్రస్ట్ , కమిట్ మెంట్ ను పూర్తి చేయడంలో కనిపించదువు. ‘ఫ్యాషన్ డిజైనర్’విషయంలో ముందే అడ్వాన్స్ ఇచ్చి చాలే ఇబ్బంది పడ్డా” అని ఒక్కింత ఆవేదన వ్యక్తం చేశారు మధుర శ్రీధర్.
నిజమే.. మధుర శ్రీధర్ ఆవేదనలో అర్ధం వుందనే చెప్పాలి. ఒక హిట్టు కొట్టినంత మాత్రాన అడ్వాన్స్ కమిట్ మెంట్ మారిపోకూడదు కదా. ఆఫర్లు లేనప్పుడు అడ్వాన్స్ లు తీసుకొని, హిట్ పడగానే కొత్త రెమ్యురేషన్ లు అడగడం నైతికంగా కరెక్టేనా? ఈ విషయం రాజ్ తరుణ్ లాంటి వాళ్లు ఆలోచించుకోవాలి.