మహేష్ బాబు-మురగదాస్ కలయికలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఇది. చాలా ప్రత్యేకలు వున్నాయి ఇందులో. మహేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇది. మురగదాస్ తో మహేష్ చేస్తున్న మొదటి సినిమా. అలాగే మహేష్ కెరీర్ లో మొదటి బైలింగ్వల్. దర్శకుడు ఎస్ జే సూర్య ఇందులో విలన్. తెలుగులో ఆయన నటిస్తున్న మొదటి సినిమా ఇదే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. మహేష్ తో ఆమెకిది మొదటి సినిమా. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. అవార్డ్ విన్నింగ్ కెమరామెన్ ఈయన. ఈయనకీ ఇదే తొలి తెలుగు సినిమా. ఇలా.. చాలా స్పెషల్ ఎట్రాక్షన్ లతో వస్తున్న సినిమా ఇది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చింది.
అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకి సంధించిన ఎలాంటి మేటిరియల్ కూడా బయటికిరాలేదు. కనీసం ఒక ఫస్ట్ లుక్ ను కూడా బయటికివదల్లేదు. దసరా, దీపావళి, క్రిష్మస్, సంక్రాంతి.. ఇలా పండగలన్నీ వెళ్ళిపోయాయి. కానీ మహేశ్ సినిమా నుండి ఎలాంటి మెటిరియల్ బయటికి రాలేదు. ఘనతంత్రదినోత్సవానికి అంటే ఈ 26కి మహేష్ ఫస్ట్ లుక్ అంటున్నారు కానీ క్లారిటీ లేదు.
మరి ఇంత సస్పెన్స్ మేంటైన్ చేయడానికి కారణం ఏమిటి,? ఫస్ట్ లుక్ చూపించంలో ఎందుకింత ఆలస్యం ? అంటే ఇక్కడ దర్శకుడు మురగదాస్ గురించి చెప్పుకోవాలి. మురగదాస్ ది సెపరేట్ స్టయిల్. తన సినిమా ఫస్ట్ లుక్ కోసం పెద్ద కసరత్తు చేస్తాడు. హీరోకి సంబధించి ఎదో ఒక ఫోటో వదిలేయడం ఆయనకు ఇష్టం వుండదు. సినిమా కాన్సెప్ట్ ను ఫస్ట్ లుక్ లో చూపిస్తుంటాడాయన. గజనీ, కత్తి, తుపాకీ ఫస్ట్ లుక్స్ చూస్తే అది అర్ధమౌతుంది. మహేష్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం మురగ ఫోకస్ అంతా షూటింగ్ పైనే వుంది. ఇంకా ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసుకోలేదట. టైటిల్ ఓకే చేసుకున్న తర్వాత కాన్సెప్ట్ డిజైన్ చేసి గ్రాండ్ గా ఫస్ట్ ను రిలీజ్ చేయాలనేది మురగ ప్లాన్. అందుకే ఫస్ట్ లుక్ విషయంలో ఈ ఆలస్యమని తెలుస్తోంది.