చికాగో, జనవరి 21 ,2017 :
మొట్ట మొదటి తెలుగు సంస్థ అయిన చికాగో మహా నగర తెలుగు సంస్థ TAGC సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఈ నెల జనవరి 21న శనివారం మధ్యాహ్నం 2:౩౦ నిమిషములకు ప్రారంభించబడి, రాత్రి 10 గంటల వరకు ఇక్కడి స్థానిక శ్రీ రామాలయంలోని కాలా ప్రాంగణములో కనువిందైన సాంప్రదాయముగా సాంస్కృతిక మరియు గణతంత్ర దినోత్సవ ప్రతీకగా కార్యక్రమాలను రూపొందించి చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1250 మందికి పైగా సభ్యులు మరియు అథితులూ హాజరైనట్లు సంస్థ కార్యదర్శి మమత లంకల చెప్పారు. ఈ సంస్థ ఆదాయప్రయోజనము లేకుండా మన తెలుగు సాంస్కృతి కట్టుబాట్లు మరియు పూర్వ సంస్కృతి ఆచార ప్రచార కార్యక్రమాలను చికాగో మహానగరంలో గత 46 సంవత్సరములుగా నిర్వహిస్తున్నారు .
ఈ కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో పాటు సంస్థ అద్యక్షులు రామచంద్రా రెడ్డి & శిరీష ఏడే గారి జ్యోతి ప్రజ్వలతో ప్రారంబించారు. సాంస్కృతిక కార్యదర్శి సుజాత కట్టగారి సంక్రాతి & గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు కార్యక్రమ వివరాలతో ప్రారంభిచారు. ఈ పండుగ విశిష్టతను స్పష్టముగా ఇలా చెప్పారు “తెలుగు సాంప్రదాయానికి ప్రతీక మన సంక్రాంతి, భోగి మంటలు, డూ డూ బసవన్నలు , హరిదాసుల కీర్తనలు ,ఇంద్రదన్స్సులను మరిపించే రంగురంగుల ముగ్గులు మా ఇంటికి రండి రండి అని ఆహ్య్వనించే గొబ్బెమ్మలు ,ఆటలు మరియు పాటలు తలపించే మన సంక్రాంతి” . ఈ కార్యక్రమాలలో చిన్నా మరియు పెద్దలు అందరూ కలసి 350 మందికిపైగా కళాకారులు పాల్గ్నోన్నారు అని వివరించారు.
శ్రీమతి శ్వేత మరియు అలంకరణ సభ్యులతో ముఖద్వారము మరియు నృత్య వేదికను సంక్రాతి మరియు గణతంత్ర దినోత్సవ ప్రతీకలతో చాలా అందముగా అలంకరించారు. నృత్య వేదికను ముందర ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు చాలా చక్కగా అలంకరించారు . ముగ్గుల పోటీలను నిర్వహించి చక్కని ముగ్గులతో వచ్చిన వారిని Deccan Spices restaurant యాజమాన్యం వారు ఇచ్చిన బహుమతులను ప్రధానిచ్చారు .
తెలుగు సాంప్రదాయానికి ప్రతీక మన సంక్రాంతి, పండుగ ప్రతికగా చిన్నారులు చేసిన నృత్యం మరియు కీర్తనలతో హరిదాసులు, తనదయిన శైలిలో మాటల తూటాలతో తుపాకీ రాముల్లు అందరిని చాలా బాగా అక్కట్టుకోంది,దివంగత శ్రీ బాలమురళీకృష్ణ గారి కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవ్వులు పండించే భంభోలా జంభ నాటిక విచ్చేసిన అతిథులను అలరించింది అనుటలో నిస్సందేహము. ఈ నాటికను రూపొందించి నటించిన మన సాంసృతిక సహాయ కార్యదర్శి ప్రవీణ్ వేములపల్లి చాలా ప్రశంసలను అందుకున్నారు .
సంస్థ ఆధ్యక్షులు రామచంద్రా రెడ్డి అధ్యక్ష ఉపన్యాసాన్నిసంక్రాతి & గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ప్రారంబించి, ఈ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి & నిర్వహించిన సాంస్కృతిక కార్యదర్శి సుజాత కట్ట మరియు సహాయ కార్యదర్శులకు & కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ గొప్పదనము, సభ్యత్వం ఎందుకు చేసుకోవాలి మరియు దాని ద్వార మనము పొందే లాభాల గూర్చి చాలా చక్కగా వివరించారు. సభ్యత్వం నమోదు & నమోదుకు సహకరించిన సభ్యత్వ కార్యదర్శి మమత లంకల , కోశాధికారి వెంకట్ గునుగంటి మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చేసిన సేవాకార్యక్రమాలకు గూర్తిoపుగా అమెరికా ఆద్యక్షుడి సంతకముతో ఇచ్చే PVSA CERTIFICATE గూర్చి వివరించారు
Youth Committee వారు Social Media Imapct On Kids అనే Topic తీసుకొని దానితో వచ్చే మంచి మరియు చెడు గూర్చి చర్చిoచుకునే వీలు కల్పించాము. ఇలాంటి కార్త్యక్రమాలను మరిన్ని జరుపాలని కోరారు
ఈ కార్యక్రమములో CANCER తో బాధ పడుతున్నవారి అవసరము కోసము BONE MARROW Registration Stall పెట్టుకునేoదులకు వీలు కల్పిస్తూ & మా సభ్యులను సహాయ సభ్యులుగా చేరిపించాము చివరగా రుచికరమైన రాత్రి బోజనమును అమర్చిన BAWARCHI RESTAURANT NAPERVILLE యాజమాన్యానికి , వడ్డించడానికి సహాయ సహకారాలు అందించిన విజయ్, శ్రీనివాస్ , దయాకర్, ప్రదీప్ కార్యకర్తలకు మరియు FOOD committee అద్యక్షులు ఉమా గారికి, వడ్డించిన కోవపూరి ఖర్చును భరించిన సత్య కొండపల్లి గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా సజావుగా జరిపించడానికి సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులు మరియు అడుగడుగునా చేదోడుగా ఉన్న మాజీ ఆధ్యక్షులు కళ్యాణ్ అనందుల, ప్రదీప్ మరియు వచ్చే సంవత్సర ఆధ్యక్షులు జ్యోతి గారికి, ప్రతి కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, దాతలకు,అతిథులకు, సభ్యులకు, శ్రేయాభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. చివరిగా ఈ సంస్థ సభ్యులూగా అందరు ఆహ్వానితులే, సభ్యులు కావాలనుకున్నావారు, రాబోయే ఆటలపోటిల వివరాలకు www.TAGC.org సందర్శిచ గలరని విన్నపం .
ఇట్లు మీ
రామచంద్రా రెడ్డి , ఏడే
President- TAGC సంస్థ