రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ ఇప్పటివరకూ మూడు సినిమాలు తీశాడు. ముడూ భారీ సినిమాలే. మిర్చి,శ్రీమంతుడు, జనతా గ్యారేజ్. మూడు భారీ హిట్లే. అప్పటివరకూ ఆ హీరోల సినిమాల్లో బెస్ట్ పొజిషన్ లో నిలిచిన చిత్రాలివి. మిర్చి ప్రభాస్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్ చేసిన చిత్రంగా నిలిచింది. మహేష్ తో తీసిన శ్రీమంతుడు, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లు కూడా అంతే. ఈ రెండు చిత్రాలు మహేష్, ఎన్టీఆర్ లకు కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను నెలకొల్పాయి. అంతా బావుందికానీ మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు సినిమా విషయంలో ఓ వివాదం ఇంకా వెంటాడటం మహేష్ బాబు వ్యక్తిగత ఇమేజ్ కి ఇబ్బంది తెచ్చిపెట్టేలావుందిప్పుడు.
శ్రీమంతుడు సినిమా కధపై కాపీ మరకపడిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమా కథ తనదేనంటూ శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో వివాచరణ ఇంకా జరుగుతోంది. ఓ వార పత్రికలో 2012లో తాను రాసిన ‘చచ్చేంత’ ప్రేమ నవలను అనుమతి లేకుండా సినిమా తీసి కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని.. వారిపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలని అంటూ గతంలో పిటీషన్ దాఖలు చేశాడు శరత్ చంద్ర. ఈ కేసు ఇంకా నడుస్తోంది.
తాను రాసిన ఈ కదా కథ స్వాతి వార పత్రికలో సీరియల్ గా వచ్చిందని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో దిన్ని సినిమాగా తీయాలని సన్నాహాలు చేసుకున్నామని, దానికి ‘చచ్చేంత ప్రేమ’ ప్రేమ అనే టైటిల్ కూడా పెట్టుకున్నామనీ, దీనిపై కొంతమంది పరిశ్రమ పెద్దలతో మాట్లాడానని, రచయిత సంఘంలో పిర్యాదు కూడా చేశానని, వారి నుండి స్పందన రాలేదని, నేను రాసుకున్న కధను చౌర్యం చేసి సినిమా తీసుకున్నారని, ఈ విషయంలో తనకు ఇండస్ట్రీ నుండి ఎలాంటి సహాయం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించానని చెబుతున్నాడు శరత్ చంద్ర.
తాజగా ఈ కేసు విచారణలోకి రాగ దర్శకుడు హీరో నిర్మాతలకు కోర్టు సమన్లు పపించింది. మరి, ఈ కేసుకు ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో గానీ మహేష్ బాబు పేరు అనవసరంగా ఇలాంటి నెగిటివ్ వార్తలో వుండటం కాస్త ఇబ్బందికరమే. ఈ వార్త వచ్చిన ప్రతీసారి ‘మహేష్ బాబుకు కోర్టు సమన్లు’ అంటూ మీడియాలో నానా హంగామా జరుగుతుంది. మరి ఈ విషయంలో మహేష్ బాబే కాస్త చొరవ చూపి వివాదం సమసిపోయేలా చూడాలి. లేదంటే కోర్టు వార్తలో మహేష్ బాబు పేరు వినిపిస్తుండటం ఆయన అభిమానులకు కూడా కాస్త షాకింగ్ గానే వుటుంది.