ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఉత్తమ సేవలు అందించిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను బుధవారం ప్రకటించింది. ఈమేరకు పద్మ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది. వీరిలో ఏడుగురికి పద్మవిభూషణ్, ఏడుగురికి పద్మభూషణ్, 75మందికి పద్మ శ్రీ పేర్లను ప్రకటించగా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన 8మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారు:
డాక్టర్. ఎక్కె యాదగిరి రావు
త్రిపురనేని హనుమాన్ చౌదరి
డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్
చంద్రకాంత్ పితవా
దరిపల్లి రామయ్య
మోహన్‌రెడ్డి వెంకట్రామ బొడనపు
వి. కోటేశ్వరమ్మ
చింతకింది మల్లేశం
పద్మ విభూషణ్ పురస్కారం వరించిన ప్రముఖులు:
శ్రీ కే జే యేసుదాదు – ఆర్ట్ మ్యూజిక్ – కేరళ
సదురు జగ్గి వాసుదేవ్ – స్పిరిట్యువలిజం – తమిళనాడుకు
శ్రీ షరద్ పవార్ – పబ్లిక్ ఎఫైర్స్ – మహారాష్ట్ర
శ్రీ మురళీ మనోహర్ జోషి – పబ్లిక్ ఎఫైర్స్ – ఉత్తర ప్రదేశ్
ప్రొఫెసర్ ఉడిపి రామచంద్ర రావు – సైన్స్ & ఇంజనీరింగ్ – కర్ణాటక
లేటు శ్రీ సుందర్ లాల్ పత్వా – పబ్లిక్ ఎఫైర్స్ – మధ్య ప్రదేశ్
లేటు శ్రీ పీ.ఏ. సంగ్మా – పబ్లిక్ ఎఫైర్స్ – మేగాలయ
పద్మభూషణ్ పురస్కారం వరించిన ప్రముఖులు:
శ్రీ విశ్వ మోహన్ బట్ – ఆర్ట్ మ్యూజిక్ – రాజస్థాన్
ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది – లిటరేచర్ – ఉత్తర ప్రదేశ్
శ్రీ తెహింటన్ ఉద్వాదియా – మెడిసిన్ – మహారాష్ట్ర
శ్రీ రత్న సుందర్ మహరాజ్ – స్పిరిట్యువలిజం – గుజరాత్
శ్వామి నిరంజన్ నంద సరస్వతి – యోగా – బీహార్
ప్రిన్సెస్ మహా చక్రి సిరిణ్ద్రోణ్ (విదేశీయులు) – సాహిత్యం – థాయిలాండ్
లేటు శ్రీ చో రామస్వామి – సాహిత్యం, జర్నలిజం – తమిళనాడు