టెక్నాలజీని వాడటంలో రాజమౌళి ముందుంటారు. ‘ఈగ’ను పట్టుకొని సినిమా తీసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న ఘనుడాయన. బాహుబలిలో కూడా విపరీతమైన టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పుడు బాహుబలికి సంబధించిన లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ ఏమిటంటే.. హీరోయిన్ అనుష్క ను కూడా టెక్నాలజీతో మాయ చేయబోతున్నాడట జక్కన్న.
సైజ్ జీరో కోసం బరువు పెంచేసింది అనుష్క. వర్క్ అవుట్స్ చేస్తే మళ్ళీ తగ్గిపోవచ్చ ధీమాతో. అయితే ఆమె బరువు తగ్గించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ‘బాహుబలి 2’లో అనుష్క యువరాణి లా కనిపించాలి. అయితే ఎంత చేసినా బరువు తగ్గించుకోవడం పెద్ద సమస్యగా మారిపోయిందట . డైలీ వర్క్ అవుట్స్, యోగాలతో బరువును ఈజీగా తగ్గించుకోగలననే ధీమా అనుష్క లో కనిపించిందట. అయితే ఈసారి మాత్రం స్వీటీ శరీరం సహకరించలేదట. ఇంకొంచెం టైం కావాలని అడుగుతూ వచ్చిందట. అయితే అనుకున్న షెడ్యుల్డ్, ప్రొడక్షన్ కాస్ట్.. ఇలా లెక్కలను పరిగణలోకి తీసుకున్న రాజమౌళి..ఇక సన్నబడే వరకూ ఆగితే పని జరగదని అనుష్క పై టెక్నాలజీని ప్రయోగించాడట.
బాహుబలికి సంబధించిన లేటెస్ట్ స్టిల్ ఒకటి వదిలారు. ఇందులో అనుష్క లుక్ చూసి షాక్ అయిపోయారు అంతా. అసలు స్వీటీ ఇంత నాజుగ్గా ఎప్పుడుతయారైయింది.? మొన్న నమో వెంకటేశాయ ఆడియో వేడుకలో కూడా భారీగా కనిపించింది కదా? మరి ఈ నాజూకు అందాలు ఎక్కడినుండి వచ్చాయి ? అనే సందేశాలు వచ్చాయి. కొందరు ఇది బాహుబలి 1 నాటి స్టిల్ అని కూడా అన్నారు.
అయితే అసలు విషయం అది కాదు. అనుష్క కోసం ఇందులో మరో టెక్నాలజీ ని వాడేశారట రాజమౌళి. షారుక్ ఖాన్ ఫ్యాన్ సినిమాలో కుర్ర షారుక్ లుక్ కోసం ‘త్రీడీ స్క్యానింగ్’ అనే టెక్నాలజీని వాడారు. ఇప్పుడు ఆ టెక్నాలజీతోనే అనుష్క సన్నగా మార్చేశారని ఇన్ సైడ్ టాక్.