మెగా హీరో సాయిధరమ్ తేజ్ జోరుమీదున్నాడు. వరుసగా తన సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం విన్నర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే మరో సినిమాకి క్లాప్ కొట్టేయడానికి రెడీ అయిపోయాడు. రచయిత బివిఎస్ రవి చెప్పిన కథకు ఇది వరకే సాయిధరమ్ ఓకే చెప్పేశాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. సోమవారం ఉదయం హైదరాబాద్ లో ఈ చిత్రానికి క్లాప్ కొట్టనున్నారు. అల్లు అర్జున్ చేతులమీదుగా ఈ సినిమా ప్రారంభం కానుంది. కృష్ణ అనే నూతన నిర్మాత ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు.
హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన బీవీఎస్ రవి దర్శకుడిగా గోపీచంద్ తో వాంటెడ్ చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. `ఈ దర్శకుడికి ఎందుకు అవకాశం ఇచ్చానో అర్థం కాలేదు` అంటూ బీవీఎస్ రవి గురించి బాహాటంగానే చాలా సందర్భాల్లో తన అసహనం వ్యక్తం చేసేవాడు గోపీచంద్. వాంటెడ్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ రచయితగానే కొనసాగాడు. రెండు సార్లు డ్రంక్ అడ్ డ్రైవ్‌లో పట్టుబడి తన లైసెన్స్‌ని కోల్పోయాడు రవి. అయితే.. ఈ పరాభవాల నుంచి తేరుకొని, మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడిప్పుడు. రవికీ.. మెగా కుటుంబానికీ సన్నిహిత సంబంధాలున్నాయి. హరీష్ శంకర్ ప్రోగ్బలంతో మళ్లీ తను మెగా ఫోన్ పట్టబోతున్నాడు. రచయితగా సక్సెస్ అయిన రవి.. దర్శకుడిగా ఇప్పుడు ఎలాంటి మార్క్ చూపిస్తాడో.. !