అఖిల్ – విక్రమ్ కె.కుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ అవ్వాల్సింది. కానీ.. నాగార్జున కథ విషయంలో రాజీ పడకపోవడంతో ఈ సినిమా ఆలస్యమవుతోంది. ఇది వరకు నాగ్‌కి ఓ కథ వినిపించాడు విక్రమ్ కె.కుమార్. ఆల్మోస్ట్ ఆ స్క్రిప్టుతో వెళ్లిపోవాల్సిందే. కానీ.. సెకండాఫ్‌లో నాగ్ కొన్ని డౌట్లు చెప్పాడట. దాంతో ఆ కథని పక్కన పెట్టేశారని సమాచారం. ఈలోగా విక్రమ్ కె.కుమార్ మరో కథని కూడా సిద్ధం చేసేశాడు. ఈ లైన్ నాగ్‌కి బాగా నచ్చేసింది. దాంతో ‘గో ఎహెడ్’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాగ్. ప్రస్తుతం విక్రమ్ ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.
ఈ సినిమా విషయంపై నాగ్ క్లారిటీ ఇచ్చేశాడు. ”ఆ రోజుల్లో నాకు శివ సినిమా ఎలా లాండ్ మార్క్ ఫిల్మ్ అయ్యిందో, తెలుగు సినిమాకి ఓ కొత్త ట్రెండ్ పరిచయం చేసిందో అఖిల్ సినిమా కూడా అలానే ఉండబోతోంది. విక్రమ్ నాకు అంత మంచి కథ చెప్పాడు. ఈ సినిమాకి ఎంత ఖర్చు పెడతాం? ఎప్పుడు మొదలెడతాం? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం? అనేది ఏం ఆలోచించడం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెరకెక్కిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 2017 ఏప్రిల్ మేలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.