సైజ్ జీరో కోసం బరువు పెంచేసింది అనుష్క. కధకు న్యాయం చేయాలని పీపాలా కనిపించింది. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. బేసిగ్గా అనుష్క యోగా టీచర్. వర్క్ అవుట్స్ పై కూడా మంచి గ్రిప్ వుంది. అన్నిటికీ మించి తన బాడీ తన కంట్రోల్ ఉటుందనే ఫుల్ కాన్ఫీడేన్స్ అనుష్కది. అయితే ఈసారి ఏమైయిందో ఎంత గింజుకున్నా బరువు తగ్గడం లేదు. బాహుబలి 2 కి కూడా అనుష్క బరువే పెద్ద సమస్యగా మారింది. బాహుబలి పార్ట్ 2లో అనుష్క యువరాణిగా కనిపించాలి. ఇందుకోసం నాజుగ్గా తయారవ్వాలి. అయితే ఈ నాజూకుదనం రాలేదు.
అయితే తాజగా బాహుబలి 2 నుండి విడుదల చేసిన ఓ పోస్టర్ లో చువ్వలా కనిపించింది. ఈ ఫోటో చూసి షాక్ అయిపోయారు జనాలు. స్వీటీ ఎప్పుడు ఇంత సన్నగా తయారైయిందని మాట్లాడుకున్నారు. ఇన్నర్ సర్కిల్స్ ఇంకో న్యూస్ కూడా వినిపించింది. బాహుబలి లో అనుష్కను నాజుగ్గా చూపించడానికి దర్శకుడు రాజమౌళి త్రీడి స్కానింగ్ అనే టెక్నాలజీని వాడరని, ఆ ఎఫెక్ట్ వల్లే స్వీటీ పోస్టర్ లో సన్నగా కనిపించిందని.
ఇపుడు స్వీటీని లేటెస్ట్ గా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ‘షో టైం మూవీ’ ఆడియో వేడుకకు విచ్చేసింది అనుష్క. ఈ వేడుకలో అనుష్క ను చూస్తే హెవీగా కనిపించింది. ఏ మాత్రం తగ్గలేదు స్వీటీ. అంతే బొద్దుగా వుంది. దీంతో బాహుబలి పోస్టర్ లో అనుష్క లుక్ టెక్నాలజీ మాయే అని తెలిపోయినట్లయింది.