‘ఖైదీ నెంబర్ 150’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు చిరంజీవి. ఈ సినిమా అదరగొట్టేసింది. ఇప్పుడు 151వ చిత్రం పై ఫోకస్ చేశారు చిరు. దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాకపోయినా తెరవెనుక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో వున్న ఈ సినిమా కోసం అప్పుడే హీరోయిన్ వేట కూడా మొదలైయింది. అందులో భాగంగా అనుష్కని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. చిరు 150వ చిత్రం కోసం కూడా ముందుగా అనుష్క పేరే పరిశీలించారు. అయితే ‘బాహుబలి 2’, బాగ్ మతి,‘సింగం 3’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ‘ఖైదీ’ కి డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది స్వీటీ. ఈసారి మాత్రం అనుష్క చిరుతో జోడి కట్టడం పక్కా అనుకున్నారు.
అయితే ఇంతలో మరో ట్విస్ట్ వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి శ్రుతి హాసన్ అయితే బాగుంటుంది అంటున్నాడట. సూరి దర్శకత్వం వహించిన రేసుగుర్రంలో నటించింది శ్రుతి. ఈ సినిమా సూపర్ హిట్. మరి ఆ సెంటిమెంటు కోసమో ఏమో కానీ అనుష్క కంటే శ్రుతి హాసన్ బెటర్ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడట. అయితే చిరు పక్కన శృతి అంటే కాస్త అదోలానే ఉటుందనే చెప్పాలి. రామ్ చరణ్ , అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో జత కట్టింది శ్రుతి. 150లో కాజల్ కూడా అంతే. శ్రుతితో పోలిస్తే కాజల్ ది కాస్త ముదిరిన ఫేసు కాబట్టి, అనుష్క డేట్స్ లేక, మరో ఆప్షన్ కనిపించకా కాజల్ తో సర్దుకుపోయారు. అయినా సరే.. తెరపై ఆ జంట కాస్త ఆర్డ్ గానే కనిపించింది. ఇప్పుడు అనుష్క లాంటి సరి జోడి వున్నప్పటికీ శ్రుతి హాసన్ వైపు మొగ్గు చూపడం ఎంత వరకూ యాప్ట్ ఛాయిసో మెగాస్టారే తేల్చుకోవాలి.