ఎన్టీఆర్ బయోపిక్ హడావుడి మొదలవ్వడంతో… బాలకృష్ణ 101వ సినిమా ఎప్పుడు, ఎవరితో అనే ప్రశ్న ప్రస్తుతానికి మరుగున పడిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్‌కి దర్శకుడు ఎవరు? ఆ సినిమాఎప్పుడు మొదలవుతుంది? అనే వాటిపైనే బాలయ్య అభిమానులు చర్చించుకొంటున్నారు. మరి 101వ సినిమా సంగతేంటి??
బాలయ్య తన తదుపరి సినిమా విషయంలో తలమునకలైనట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని కథల్ని లాక్ చేశాడట. అందుకు తగ్గ దర్శకుడ్ని వెతకడమే ఆలస్యం అని తెలుస్తోంది. మరోవైపు శ్రీవాస్.. బాలయ్యకు ఓ కథ చెప్పాడట. అది బాలయ్యకు బాగా నచ్చిందని తెలుస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన డిక్టేటర్ గతేడాది సంక్రాంతికి విడుదలై కమర్షియల్ హిట్ అనిపించుకొంది. బాలయ్యని స్టైలీష్‌గా, ట్రెండీగా చూపించడంలో శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు. అందుకే శ్రీవాస్ కే మరో ఛాన్స్ ఇవ్వాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. పైగా కథ కూడా నచ్చడంతే బాలయ్య తన 101వ చిత్రాన్ని శ్రీవాస్ చేతికే అప్పగించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. భవ్య ఆర్ట్స్ సంస్థ బాలయ్య 101వ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించింది. అయితే ఇప్పుడు భవ్య చేతి నుంచి ఈ ప్రాజెక్టు జారిపోయిందని, బెల్లం కొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.