రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో ఓ చిత్రం ఇటీవలే కొబ్బరికాయ్ కొట్టుకొన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ తెరకెక్కించే ఈ చిత్రం లో సమంత కథానాయికగా నటిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రేపల్లె, ఊరికి మొనగాడు, పల్లెటూరి ప్రేమలు.. లాంటి టైటిళ్లు ఇండ్రస్ట్రీ సర్కిల్స్‌లో తిరుగుతున్నాయి. ఇందులో జగపతిబాబు ఓ కీ రోల్ చేయబోతున్నాడని చెప్పుకొన్నారు. చిత్రబృందం ప్రకటించిన కాస్ట్ అండ్ క్రూ లిస్టులో జగపతి పేరు ఉంది. దాంతో నాన్నకు ప్రేమతో మ్యాజిక్ రిపీట్ చేయడానికి సుకుమార్ ట్రై చేస్తున్నాడనిపించింది. అయితే జగపతిబాబు ఈ సినిమాలో నటించేదీ, లేనిదీ ఇంకా డిసైడ్ అవ్వలేదని టాక్. జగపతిబాబుకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయకపోవొచ్చని తెలుస్తోంది. ఒక వేళ జగపతిబాబు `నో` అంటే ఎవరిని తీసుకోవాలా?? అనే ఆలోచనలో పడిపోయింది చిత్రబృందం.
మరోవైపు ఆది పినిశెట్టి పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాలో ఆది ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆది ఈ సినిమాపై ఇంకా సైన్ చేయలేదట. `సరైనోడు` తరవాత ఎన్ని ఛాన్సులొచ్చినా, నో చెప్పిన ఆది పినిశెట్టి, ఈసారీ అదే మాటమీద ఉన్నాడని, ఆది ఈ సినిమా ఒప్పుకొనే అవకాశాలు తక్కువుగా ఉన్నాయని తెలుస్తోంది. దాంతో ఆది స్థానంలో మరో నటుడి కోసం అన్వేషిస్తున్నారు