సినిమాలలో కూడా పవన్ యాక్టింగ్ కంటే ఆయన పేల్చే పంచ్ డైలాగ్స్కే ఆయన ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతూ ఉంటారు. గబ్బర్‌సింగ్ సిినిమాలో అలాంటి బోలెడన్ని పంచ్ డైలాగులతోనే పదేళ్ళ తర్వాత ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు పవన్. సినిమాలలో ఫాలో అయిన అదే ‘పంచ్ డైలాగ్’ ఫార్ములాని ఇప్పుడు పాలిటిక్స్‌లో కూడా ఫాలో అవుతున్నట్టున్నాడు పవన్. అయితే సినిమాలలో మన హీరోలు చెప్పే చాలా పంచ్ డైలాగులు బయట మామూలు జీవితంలో మాట్లాడుకుంటే పిచ్చ ఫన్ జెనరేట్ అవుతుంది. ఆ డైలాగులు చెప్పినవాడు మాంచి కమెడియన్ అవుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేల్చిన ‘చంపేస్తారు’ డైలాగ్ కూడా కామెడీనే అవుతోంది.
సినిమాలలో కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్‌ని వదులుకుని ప్రజల తరపున పోరాడడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానని కాస్త గట్టిగా మరోసారి చెప్పాలనుకున్నాడు పవన్. అందుకోసం వేరే ఎన్ని మాటలైనా చెప్పి ఉంటే బాగానే ఉండేదేమో కానీ మరీ టూ మచ్ అని అందరూ అనుకునేలా ‘చంపేస్తారు’ అనే డైలాగ్ వాడేశాడు పవన్. అది కూడా జనసేన పార్టీ స్థాపించినందుకో, లేకపోతే అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున టిడిపి, కాంగ్రెస్ నాయకులను తిడుతూ ప్రచారం నిర్వహించినందుకో ‘చంపేస్తారు’ అని బెదిరింపులు వచ్చాయని చెప్పి ఉంటే కాస్త నమ్మశక్యంగా ఉండేది. కానీ ‘కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ పేరుతో ఓ స్వచ్ఛంధ సంస్థను స్థాపించినందుకు పవన్‌కి ‘చంపేస్తారు’ అన్న బెదిరింపులు వచ్చాయట. పవన్‌కి తెలుసో…తెలియదో కానీ ఆల్రెడీ వేలాది సంఖ్యలో ఉన్న స్వచ్ఛంధ సంస్థలు కామన్ మేన్ కోసం ఫైట్ చేస్తున్నాయి. కనీసం పదుల సంఖ్యలో ఉన్న స్వచ్ఛంధ సంస్థలు నిజాయితీగానే ప్రజల కోసం పనిచేస్తున్నాయి. మరి వాళ్ళెవరికీ లేని భయం పవన్‌కి మాత్రం ఎందుకు? అయినా సిఎంపిఎఫ్ సంస్థను స్థాపిస్తున్నాను, ఆ సంస్థకు కోటి రూపాయల డొనేషన్ ఇస్తున్నాను అని చెప్పి ఒక్క రోజు పవన్ చేసిన షో మినహా ఆ ‘కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ సంస్థ, ఆ సంస్థ తరపున పవన్ కళ్యాణ్….ఎంతమంది సామాన్యులకు ప్రొటెక్షన్ ఇచ్చారో, ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో ఎవ్వరికీ తెలియదు. అసలు సిఎంపిఎఫ్ అనే సంస్థ ఒకటి ఉందన్న విషయాన్ని ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణే మర్చిపోయాడని మీడియాలో బోలెడన్ని జోకులు వినిపించాయి. మరి ఏమీ చేయని, అసలు ఉందో లేదో కూడా తెలియని కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినందుకు ‘చంపేస్తారు’ అని పవన్‌ని బెదిరించే అవకాశం ఉందా? ఆ బెదిరించిన వాళ్ళు ఎవరో పవన్ చెప్పగలడా? భారతదేశంలో కామన్ మేన్ కోసం ఫైట్ చేయడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అన్న గొప్ప మెస్సేజ్‌ని అమెరికా వెళ్ళి మరీ ఇవ్వడం అవసరమా?
కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినందుకు ‘చంపేస్తారు’ అని పవన్‌ని ఎవరు బెదిరించారో కానీ ….పవన్ నుంచి ఆ మాటలు వినిపించిన మరుక్షణం నుంచి పవన్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ‘ఖబడ్దార్, పవన్‌ని ఎవరైనా ఏమైనా అంటే అంతు చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం…’ అంటూ రెచ్చిపోతున్నారు. పవన్ పేల్చిన ‘చంపేస్తారు’ పంచ్ డైలాగ్ ఉద్ధేశ్యం ఇలా అభిమానులను రెచ్చగొట్టడమే అయితే మాత్రం ఈ డైలాగ్ కూడా సూపర్ హిట్ అయినట్టే. అయితే బుక్స్ చదువుతూ ఉంటాడు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు అని చాలా మంది చెప్తున్న పవన్ నుంచి ఈ తరహా ‘అమ్మ ఆత్మ చెప్పింది, నాన్న కోసం ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళకోసం, చంపేస్తారు….’ లాంటి ఆవేశపూరిత, అనాలోచిత రాజకీయాలను కాకుండా కాస్త విషయం ఉన్న పాలిటిక్స్‌ని కోరుకుంటున్నారు. గబ్బర్సింగ్లాగా కథ లేకుండా పంచ్ డైలాగ్స్‌తో, కామెడీ సీన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా కాదు …..సబ్జెక్ట్, విధానాలు, ఆశయాలు, పవన్ అభిమానిస్తాడని చెప్తున్న చేగువేరా, మార్టిన్ లూథర్ కింగ్‌ల లాగా ఎప్పుడు, ఎలా, ఏం చేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టత ఉన్న పోరాటాలను, పాలిటిక్స్‌ని పవన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే గొప్ప చదువరి, ఆలోచనాపరుడు, పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పాలిటిక్స్‌లోకి వచ్చాడు అని చెప్పి తాను కోరుకుంటున్న ఇమేజ్‌ని ప్రజల ఆలోచనల్లో సృష్టించుకుంటాడు పవన్.