జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో… పూరి జగన్నాథ్ ఆఫీసులో ఛార్మి తన జెండా ఎగరేసింది. అప్పట్లో పూరి ఆఫీసు వ్యవహారాలన్నీ.. ఛార్మి తన చేతుల్లోకి తీసుకొందని, అక్కడి ఆఫీసు స్టాఫ్‌ని కూడా కంట్రోల్లోఉంచుకొందని, జ్యోతిలక్ష్మి వ్యాపార లావాదేవీలన్నీ ఛార్మి చేతుల మీదుగా జరిగాయని ప్రచారం జరిగింది. ఆ సినిమాకి ఛార్మి సహనిర్మాతగానూ వ్యవహరించింది. అయితే.. జ్యోతిలక్ష్మి తరవాత పూరి – ఛార్మిలు తాత్కాలికంగా దూరం జరిగారు. ఆ సమయంలో పూరి ఆఫీసు చుట్టుపక్కలకు కూడా రాలేదు ఛార్మి. మళ్లీ ‘వ్యవహారాలు’ అన్నీ సద్దుమణిక… పూరి – ఛార్మిల మధ్య స్నేహం ఎప్పటిలానే వర్థిల్లింది.
అయితే ఆ సమయంలో కూడా పూరి ఆఫీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు ఛార్మి. అయితే ఇప్పుడు మళ్లీ ఛార్మి విజృంభిస్తోందని తెలుస్తోంది. ‘రోగ్’ సినిమా కంట్రోల్ అంతా తన చేతుల్లోకి తీసుకొందట. యాడ్లు ఎవరెవరికి ఇవ్వాలి? ప్రమోషన్లు ఎలా చేయాలి? అనే విషయాల్లో నిర్ణయాధికారం పూర్తిగా ఛార్మిదేనట. అందుకే పూరి కాంపౌండ్‌లో ఛార్మి హవా మళ్లీ మొదలైపోయిందంటూ చిత్రసీమలో గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పూరి సొంత బ్యానర్లో మళ్లీ సినిమాలు రానున్నాయని, వాటిని కూడా ఛార్మి నేతృత్వంలోనే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మరి ఈ సరికొత్త పెత్తనం ఇంకెన్ని రోజులో..!