పటాస్ తో మళ్ళీ తేరుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అంతకుముందు అంటే దాదాపు పదేళ్ళు కళ్యాణ్ హిట్ అనే మాటే వినలేదు. సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఈ దశలో వచ్చిన ”పటాస్” కళ్యాణ్ లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. అయితే పటాస్ తర్వాత ఆ ఫామ్ కొనసాగించడంలో మళ్ళీ విఫలం అవుతున్నాడు కళ్యాణ్. ఈ సినిమా తర్వాత వచ్చిన షేర్ ,ఇజం చిత్రాలు నిరాశను మిగిల్చాయి. షేర్ మాట పక్కన పెడితే.. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇజం పై చాలా ఆశలు పెట్టుకున్నాడు కళ్యాణ్. దీనికోసం భారీ ఖర్చుపెట్టాడు కూడా. అయితే సినిమా మాత్రం పల్టీకొట్టేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్. ‘
ఇజం తర్వాత కొత్త సినిమా ప్రకటన ఏదీ చేయలేదు. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నాడు. అయితే కధ పై గురి కుదరక దాన్ని డ్రాప్ చేశాడు. నారా రోహిత్ తో సావిత్రి సినిమాతీసిన పవన్ సాధినేనితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు కళ్యాణ్. ఈలోగా మరో దర్శకుని లైన్ లో పెట్టాడు. ఉపేంద్ర అనే కొత్త దర్శకుడు చెప్పిన కధకు ఓకే చెప్పాడట కళ్యాణ్. శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు ఉపేంద్ర. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యాడు. కళ్యాణ్ రామ్ ను కలసి ఓ కధ చెప్పాడు. ఇది కళ్యాణ్ కూ నచ్చిందట. అయితే మొదట పవన్ సాధినేని తో సినిమా చేసిన తర్వాతే ఉపేంద్ర సినిమా సెట్స్ పైకి తీసుకువెళతారని సమాచారం.