నందమూరి బాలకృష్ణ 101వ సినిమా దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. దాదాపు అరడజను మంద కథలు పట్టుకొని రెడీగా ఉన్నా, బాలయ్య మాత్రం తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రవికుమార్‌తో రెండు మూడు దఫాల సిట్టింగులు వేశాడట బాలయ్య. చివరి సిట్టింగ్‌లో కథ ఓకే అయిపోయిందని టాక్. ఇక బాలయ్య కాల్షీట్లు ఇవ్వడమే బాకీ అని, షెడ్యూల్స్ వేసుకొని రంగంలోకి దిగిపోవడం తరువాయి అని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కోసం రెండు టైటిళ్లు అట్టి పెట్టుకొన్నార్ట. రెడ్డిగారు, జయసింహా అనే టైటిళ్లలో ఏదో ఒకటి ఖాయం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రెడ్డి, సింహా.. రెండూ బాలయ్యకు అచ్చొచ్చిన టైటిళ్లే. సమరసింహారెడ్డి బాలయ్య కెరీర్లో మర్చిపోలేని సినిమా. చెన్నకేశవ రెడ్డి కూడా బాగానే ఆడింది. ఇక సింహా సెంటిమెంట్ గురించి చెప్పక్కర్లేద్దు. లక్ష్మీ నరసింహా, సింహా, నరసింహానాయుడు ఇలా దాదాపుగా సింహా పేరు వాడినప్పుడల్లా బాలయ్య హిట్లు కొట్టాడు. ఈసారీ.. జయ సింహాకే ఓటేసే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. నిర్మాత ఎవరు? ఎప్పుడు మొదలవుతుంది? అసలు ఈ ప్రాజెక్టుపై బాలయ్య ఫైనల్ డిసీజన్ ఏంటన్నది త్వరలో తెలుస్తాయి.