అఖిల్ – శ్రియా భూపాల్ ల పెళ్లి ఆగిపోయిన వార్త టాలీవుడ్ అంతా టామ్‌టామ్ అంటోంది. నేషనల్ మీడియా కూడా ఈ బ్రేకప్‌పై ఫోకస్పెట్టింది. కొన్ని ఆంగ్ల పత్రికలైతే… ఇద్దరూ విడిపోయారని, అందుకు కారణాలు ఇవీ.. అంటూ రకరకాల కథనాలు ప్రచురించాయి. కొన్ని కథనాలు మరీ షాకింగ్‌గా ఉన్నాయి. శ్రియా భూపాల్ కీ నాగార్జునకీ అస్సలు పడడం లేదని, ఓ సందర్భంగా అందరి ముందూ శ్రియా నాగ్ని నానా మాటలూ అందని, అందుకే నాగ్ చిన్నబుచ్చుకొన్నాడని, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేశాడని కథనం వినిపిస్తోంది. అఖిల్ – శ్రియాల పెళ్లి ఆగిపోయిందన్నది ఖాయం. దానికి గల కారణాలు, విశ్లేషణలూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఇచ్చుకొంటున్నారు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్‌పై అటు అఖిల్ గానీ, ఇటు నాగార్జున గానీ నోరు విప్పడం లేదు.
సాధారణంగా.. ట్విట్టర్ వేదిక చేసుకొని అఖిల్ కొన్ని క్లారిటీలు ఇస్తుండేవాడు. తన తొలి సినిమా మొదలవ్వక ముందు నుంచీ ట్విట్టర్‌తో రెగ్యులర్ టచ్‌లో ఉండేవాడు అఖిల్. తన సినిమాల విషయంలో వచ్చే పుకార్లకు తానే క్లారిటీ ఇచ్చేవాడు. ఆఖరికి చిన్న చిన్న వార్తలకు కూడా స్పందించేవాడు. అలాంటిది అఖిల్ పెళ్లి పెటాకులైందన్న వార్త.. టాలీవుడ్ అంతా చెలరేగిపోతోంటే అఖిల్ ఎందుకు స్పందించలేదు? నాగ్ ఎందుకు నోరు మెదపలేదు? అంటే దానికి కారణం.. ఈ బ్రేకప్ నిజమే అన్నమాట. అయితే.. అటు అఖిల్లోనూ, ఇటు నాగ్లోనూ.. ఎందుకో ఈ సంబంధం వదులుకోకూడదన్న కోరిక కాస్తో కూస్తో ఉండే ఉంటుంది. అందుకే తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. చివరి క్షణం వరకూ ఎదురు చూద్దామని, ఆ తరవాత ఈ పెళ్లి క్యాన్సిలేషన్‌పై ఓ క్లారిటీ ఇవ్వొచ్చని నాగ్, అఖిల్‌లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. నాగ్, అఖిల్‌లు ఏదో ఓ విషయం చెప్పేంత వరకూ ఈ కథనాల వంటకాలు.. రుచి చూడాల్సిందే.