గౌతమి పుత్ర తరవాత బాలయ్య సినిమా ఏంటన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర పడింది. దాదాపు అరడజను దర్శకులు, ఓ డజను కథలు చర్చకు వచ్చిన తరవాత.. బాలయ్య ఓ కథని ఫిక్స్ చేశాడు. ఆ ఛాన్స్ పూరి జగన్నాథ్ కి దక్కింది. బాలయ్య పూరి ల సినిమా కన్ ఫామ్ అయిపోయింది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది. మార్చి 9న ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టేస్తారు. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ మొదలెట్టే అవకాశం వుంది. భవ్య ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఒకట్రెండు రోజుల క్రితం వరకూ బాలయ్య 101వ సినిమాకి తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కూడా రేసులో వున్నాడు. అయితే.. బాలయ్య పూరి కథపై మనసు పడ్డాడట. పూరి టేకింగ్ పై నమ్మకంతో బాలయ్య ఈ కథకు ఒకే చేసినట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య ఫైనల్ నేరేషన్ ఇంకా వినలేదని టాక్. కథ బాగుందని, ఫైనల్ నేరేషన్ మాత్రం పూరి ఇంకా చెప్పలేదని అయితే పూరి పై నమ్మకంతో బాలయ్య ఈ కథకు ఒకే చెప్పాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.