నందమూరి బాలకృష్ణ 101వ సినిమా పూరి జగన్నాథ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాని ఆఘమేఘాల మీద పట్టాలెక్కించేసి, అనుకొన్న సమయానికి విడుదల చేసేయాలని పూరి గట్టిగా డిసైడ్ అయిపోయాడు. అనుకొన్నదే తడవుగా కాస్టింగ్ లిస్టుని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆ ముగ్గురిలో ఒకమ్మాయి స్టార్ హీరోయిన్, మిగిలిన ఇద్దరూ కొత్తవారిని తీసుకోవాలని పూరి ఎప్పుడో ఫిక్సయిపోయాడు. అయితే ఆ ప్లాన్ మారింది. ముగ్గురూ కొత్తవారే ఉండాలని పూరి డిసైడ్ అయిపోయాడు. అంతే కాదు.. విలన్‌గానూ కొత్తవాళ్లనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కమిడియన్లను, సైడ్ క్యారెక్టర్లనీ ఇలా దాదాపు ప్రధానమైన పాత్రలన్నింటిలోనూ కొత్తవాళ్లనే తీసుకొంటున్నారు. అందుకు సంబంధించిన కాస్టింగ్ కాల్ వచ్చేసింది. బాలయ్య సినిమాకి కొత్తవాళ్లు కావాలని పూరి ఓ ప్రకటన విడుదల చేశాడు. ముగ్గురు హీరోయిన్లు, ఒక విలన్, పొలిటీషన్ పాత్రకోసం ఒకర్ని, కమిడియన్‌గా ఒకరిని, అమ్మ పాత్రకు ఒకరు.. ఇలా లిస్టంతా బయటకు తీశాడు.
స్టార్ రెమ్యునరేషన్లు తగ్గించి, ఆ పెట్టుబడి అంతా మేకింగ్‌కి పెట్టాలన్నది పూరి ప్లాన్ కావొచ్చు. ముగ్గురు స్టార్ హీరోయిన్లను తీసుకొంటే రెమ్యునరేషన్ ఎంత కాదన్నా.. రూ.2 కోట్ల వరకూ అవుతుంది. మిగిలిన కాస్టింగ్‌కి మరో రూ.2 కోట్లు అనుకొంటే… రూ.4 కోట్లు కలిసి వచ్చినట్టే. అదంతా మేకింగ్‌లో పెడితే.. మరింత క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. పూరి ప్లాన్ బాగుంది. అందుకు బాలయ్య అండా ఉంది. అందుకే ఈ కాస్టింగ్ కాల్ బయటకు వచ్చింది. పూరికి కావల్సిన వాళ్లంతా దొరికేస్తారా. వాళ్లను వెదికిపట్టుకోవడానికి, కావల్సిన తర్ఫీదు ఇవ్వడానికి పూరికి ఎంత టైమ్ పడుతుంది?? ఈ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు?? అనేవి ఆసక్తి కరమైన విషయాలే. కొత్తవాళ్లతో పెట్టుకొంటే.. మేకింగ్ కి టైమ్ పట్టేస్తుంది. అయినా సరే.. ఈప్రాజెక్టుని అనుకొన్న సమయానికి రెడీ చేస్తానన్న ధీమాలో ఉన్నాడు పూరి. మరి ఏం జరుగుతుందో చూడాలి.