నాగార్జున గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెర మన్మధుడాయన. ఐదు పదుల వయసు మీద పడినా ఆయన ఇంకా మన్మధుడే. నాగ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. హీరోయిన్స్ కూడా ఆయన్ను అభిమానిస్తారు. నాగ్ ఫ్యాన్ క్లబ్ లో వుండే హీరోయిన్ లిస్టు పెద్దదే. ఇప్పుడు మరో సినియర్ నటీమణి నాగార్జున పై తనకున్న అభిమానం చాటుకుంది. ఆమె ఎవరో కాదు… పవిత్ర లోకేష్. ఒకప్పుడు కన్నడ హీరోయిన్ పవిత్ర. ఇప్పుడు టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలకి అమ్మగా కనిపించింది పవిత్ర.
తాజగా ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూ లో నాగార్జున పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టారామె. ‘’నా టీన్ ఏజ్ లో ‘గీతాంజలి’ సినిమా చూసా. అప్పటి నుండి నాగార్జునకి వీరాభిమాని అయిపోయా. నా జీవితంలో కూడా అలాంటి వ్యక్తి వుండాలని అనుకునేదాన్ని. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నా ఫస్ట్ క్రస్. తెలుగులో నటించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. అయితే ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. కనీసం మాట్లాడలేదు కూడా. ఇప్పుడు ఆయన అంటే ఒక రకమైన గౌరవం వుంది. అందుకే దూరంగానే వుండిపోయా. అలాగే ప్రకాష్ రాజ్ అంటే కూడా ఇష్టం. ఆయనతోనూ నటించే అవకాశం వచ్చింది. మనకి ఇష్టమని నటులతో కలసి నటించే అవకాశం రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అని తన మనసులో మాట చెప్పుకొచ్చారు పవిత్ర.
అన్నట్టు.. తాజగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు పవిత్ర. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ కు అత్తగా కనిపించనున్నారు.