ప్రపంచంలో ఉన్న ఎక్కువ శాతం దేశాల్లో మెజారిటీ మతస్తులకు అదనపు సౌకర్యాలు చాలానే ఉంటాయి. పాలనా వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకునే నడుస్తూ ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం పూర్తి రివర్స్‌లో ఉంటుంది వ్యవహారం. ఓట్ల మహత్యమో ఏమో తెలియదు కానీ మైనారిటీ మతస్తుల ఓట్లను గెలుచుకోవడం కోసమే నాయకులందరూ తాపత్రయపడుతూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న చాలా ఎక్కువ మతాల ప్రజల కంటే కూడా హిందువులు విశాల దృక్పథంతోనే ఉంటారు. అందుకే సామ్రాజ్యవాద కాంక్ష కానీ, వేరే మతాల వాళ్ళను హిందూ మతంలోకి బలవంతంగా మార్చాలన్న ప్రయత్నాలు కానీ హిందువుల్లో చాలా చాలా తక్కువ. ఇంకా అనేక విషయాల్లో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవరుచుకుని ఉంటారు హిందువులు. కానీ భరిస్తూ ఉన్నారు కదా అని చెప్పి హిందువుల మనోభావాలపైన రాళ్ళదెబ్బలతో కొడుతూ ఉంటారు చాలా మంది. ఈ ధోరణి అంతకంతకూ పెరుగుతూ ఉందే తప్ప తగ్గడం లేదు. హిందూ దేవుళ్ళ బొమ్మల విషయంలో అయితే ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. ఓట్ల కోసం హిందూ మతాన్ని జపిస్తూ ఉండే బిజెపి నాయకులు కూడా చాలా విషయాల్లో లౌక్యం ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే హిందువుల ప్రయోజనాల గురించి అతిగా మాట్లాడుతూ వివాదాస్పదం చేస్తూ ఉంటారు. ఇక లౌకిక వాదులం అని చెప్పుకునే చాలా మంది కుహానా మేధావులు మీడియా ముందు ఓ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఒక హిందూ సాధువు తప్పుగా మాట్లాడితే మొత్తం హిందూ సమాజానికే ఆపాదిస్తూ గంటల తరబడి లైవ్ డిస్కషన్స్‌లో మొత్తం హిందూ సమాజాన్ని ఏకిపడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగానే హేతువాదులు అని చెప్పి వాళ్ళ మాటలను అర్థం చేసుకుందామనుకుంటే….వాళ్ళ హేతువాదం అంతా కూడా కేవలం హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారు. అదేమీ విచిత్రమో మరి. అలాంటి వాళ్ళందరూ కూడా స్పాన్సర్డ్ స్పీకర్స్ కాదు కదా అన్న అనుమానం చాలా సార్లు వస్తూ ఉంటుంది. డబ్బులిచ్చి హిందువులను వేరే మతంలోకి మారుస్తున్న జనాలు ఉన్నప్పుడు ……..డబ్బులిచ్చి మరీ హిందూ మతాన్ని తిట్టించే జనాలు మాత్రం ఎందుకు ఉండకూడదు?
అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి చాలా మంది హిందూ బాబాలు, పూజారులు వాళ్ళకు నచ్చినట్టుగా మాట్లాడేశారు. వాళ్ళ మాటలు తప్పు అని చెప్పి …ఇక ఆదిమానవుడి కాలంలోనే ఉన్నారని చెప్పి అలాంటి వాళ్ళందరినీ ఉతికి ఆరేశారు హేతువాదం పేరు చెప్పుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళందరూ కూడా. మరి అదే అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి అంతకంటే నీచంగా ఓ పాస్టర్ మాట్లాడాడు. రోడ్డు మీద తిరిగే రోమియోల్లాగా ఓ స్టేట్మెంట్ పడేశాడు. కానీ ఆ పాస్టర్ మాటలకు కనీసం మీడియాలో కూడా ప్రాధాన్యత దక్కలేదు. అలాగే హేతువాదులం అని చెప్పుకుతిరుగుతున్న వాళ్ళెవ్వరికీ కూడా స్పందించాలన్న స్పృహ లేకుండా పోయింది ఎందుకో మరి. మీడియా ఛానల్స్ వారికి కూడా లైవ్ డిస్కషన్స్ పెట్టి మరీ ఆ పాస్టర్ని పదిమందీ చేతా తిట్టించాలన్న ఆలోచనలు రాలేదు ఎందుకో మరి. ఒక రోజు తేడాలో అమ్మాయిని రేప్ చేసిన పాస్టర్ అన్న ఒక న్యూస్ కూడా మీడియాలో కనిపించింది. ఈ సారి కూడా నో రెస్పాన్స్. ఆ పాస్టర్స్ని తిట్టాలి, క్రిస్టియన్ మతాన్ని విమర్శించాలి అని ఎవ్వరూ కోరుకోవడం లేదు కానీ వ్యక్తులు చేసిన తప్పులను మతానికి ఆపాదించకూడదు అన్న స్పృహ హిందూ మతం విషయంలో కూడా ఎందుకు ఉండదు అన్న ఆవేదన మాత్రం హిందువుల్లో ఉంది. టెర్రరిస్టులకు కూడా మతం లేదు, టెర్రరిజానికి మతం లేదు అనే కోణంలోంచి ఆలోచించేలా ప్రజలందరికీ ఉపదేశాలు ఇస్తూ ఉండే మనదేశంలో….ఒక పూజారినో…ఒక ఆరెస్సెస్ కార్యకర్తనో తప్పుగా మాట్లాడినంత మాత్రాన మొత్తం హిందూ సమాజానికి ఆ వ్యాఖ్యలను ఆపాదించడం…..హిందూ మతానికి ప్రతినిధులుగా కేవలం మంత్రాలను మాత్రమే నేర్చుకున్న పూజారులను స్టూడియోల్లో కూర్చోపెట్టడం….ఎదురుగా పిజిలు, పిహెచ్‌డిలు చేసిన స్కాలర్స్‌ని తీసుకొచ్చి కూర్చోపెట్టడం……..హేతువాదులమని చెప్పుకునే ఆ స్కాలర్స్ మాటలను హైలైట్ చేస్తూ పూజారులను కమెడియన్స్‌ని చేయడం లాంటి ప్రజెంటేషన్స్ ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించాలని అయితే ప్రతి హిందువూ కోరుకుంటున్నాడు. సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? మిగతా అన్ని మతాలతో పోల్చితే హిందూ మతంలో ఉన్న తప్పులను మాత్రమే చాలా చాలా ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు అనే విమర్శను ఖండించేవారు ఎవరైనా ఉన్నారా?