చట్ట సభల సభ్యుల బూతులు తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. జబర్ధస్త్ లాంటి ప్రోగ్రామ్స్‌కి కూడా చట్ట సభల సభ్యుల బూతులే ఇన్స్పిరేషన్ అయ్యేలా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. ఈ బూతుల పర్వాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళింది మాత్రం రోజా, నన్నపనేని రాజకుమారిలాంటి వాళ్ళే. టిడిపిలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి హంగామా మామూలుగా ఉండేది కాదు. కాంగ్రెస్ మహిళానేతలు కూడా పోటీపడేవాళ్ళు కానీ వీళ్ళిద్దరి ముందు వాళ్ళు తేలిపోయేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నన్నపనేని ఈ బూతు టీంలో ప్లేస్ కోల్పోయారు కానీ రోజా మాత్రం వైస్సార్సీపీ తరపున మొదలెట్టింది. రోజాకు పోటీగా బోండా ఉమామహేశ్వరరావులాంటి వాళ్ళు రెడీ అయ్యారు. అసెంబ్లీలోనే ‘రేయ్…ఏరా రేయ్…పాతేస్తా నాకొడక’ అన్న టాప్ క్లాస్ బూతులను వినిపించిన ఘనత బోండా ఉమామహేశ్వరరావుది. రోజాతో పాటు వైకాపా నేతల్లో కూడా చాలా మంది వీధి బాషను విచ్చలవిడిగా వాడేస్తూ ఉండేవారు.
అయితే ఇప్పుడు వీళ్ళందరినీ బీట్ చేయడానికి జెసి ప్రభాకర్‌రెడ్డి లైన్లోకి వచ్చాడు. పైన చెప్పుకున్న సభ్యుల బూతులను ఎలాగో ఒకలాగా ప్రచురించడానికి మీడియాకు అవకాశం ఉండేేది. కానీ జెసి ప్రభాకరరెడ్డి మాత్రం మీడియాకు ఆ అవకాశం లేకుండా చేశాడు. మహిళలంటే మాకు ఎంతో గౌరవం అని మాటలు చెప్తూ ఉండే వాళ్ళు కాస్తా అమ్మ పదాన్ని కూడా ప్రస్తావనలోకి తెచ్చిమరీ టాప్ రేంజ్ బూతును వాడేశాడు. ఇక ఏరా, రేయ్, వాడు, వీడు, …..కొడుకు లాంటి బూతులు అయితే లెక్కేలేదు. వీధి రౌడీల భాష విషయంలో తన ప్రావీణ్యం ఏ పాటిదో తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. తన స్థాయి ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. జేసి ప్రభాకర్‌రెడ్డి తిట్టిన తిట్లతో జగన్‌కి జరిగే నష్టం ఏంటో తెలియదు కానీ జేసీల భాష ఎంత దిగజారుడు స్థాయిలో ఉంటుందన్న విషయం మాత్రం ప్రజలందరికీ అర్థమైంది. జగన్ భాషను ప్రతి సారీ తప్పు పడుతూ ఉండే చంద్రబాబు ఇప్పుడెలా స్పందిస్తాడో చూడాలి. టిడిపి అంటేనే క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు జేసీల బూతు పర్వం విషయంలో ఏం చర్యలు తీసుకుంటాడో చూడాలి. లేకపోతే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగా చంద్రబాబుతో ఉన్నంత కాలం జేసీల రౌడీయిజానికి అడ్డేలేదన్న విషయాన్ని నిజం చేస్తాడేమో చూడాలి. ఆ విషయం పక్కనపెడితే తెలుగు చట్టసభ సభ్యుల చరిత్రలో ది బెస్ట్ బూతులు వాడిన ఘనత మాత్రం జేసీ ప్రభాకరరెడ్డికి దక్కింది. మరి బూతు రత్న అవార్డ్ సాధించిన ఈ టిడిపి ఎమ్మెల్యేకి బాబుగోరు ఎలాంటి సన్మానం చేస్తాడో చూడాలి? జేసీ బూతుల విషయంలో కనీసం స్పందించలేని బాబుకు రోజా బూతుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా?
J.C Prabhakar Reddy Shocking attack on Y.S. Jagan ; Such unparliamentary language is never heard before in public pressmeet. VIDEO : pic.twitter.com/igKBC3dPp6
— Telugu360 (@Telugu360) March 4, 2017