మంజరి.. గుర్తుందా? అల్లరి నరేష్ ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైయింది. అందంగా కనిపించింది. నటన కూడా పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి అవకాశం వచ్చింది. కళా తపస్వీ విశ్వనాద్ ‘శుభప్రదం’లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. విశ్వనాద్ అంటే అదో బ్రాండ్. అందరికీ ఆ అవకాశం దక్కదు. అలంటి అవకాశం దక్కించకుంది మంజరి. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా రాణించలేదు. ఆ ప్రభావం ఆమె కెరీర్ పై కూడా పడింది. ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ‘శక్తి’ చిత్రంలో ఓ పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా పల్టీకొట్టేయడంతో ఆమె నిగిటివ్ మార్క్ పడిపోయింది. అటు హిందీలో కూడా అవకాశాలు రాలేదు. దీంతో కొంత విరామం తీసుకుంది మంజరి.
ఇప్పుడు ఆమె మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ లో ‘జీనా ఇసీకా నామ్ హై’ పేరుతొ ఓ సినిమా చేసింది మంజరి. ఈ సినిమాలో హిమాన్ష్ కొహ్లీతో జతకట్టింది అమ్మాడు. ఇందులో చాలా బోల్డ్ పాత్ర పోషించిందట. ఘాటు లిప్‌లాక్ లకు కూడా ఓకే చెప్పిందట. అంతేకాదు టాలీవుడ్ లో కూడా ఓ సినిమా అంగీకరించిందట. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి అంటోంది అమ్మడు. మరి ఇంతకాలం ఎందుకు విరామం తీసుకున్నారు అని అడిగితే మాత్రం ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పింది. తుఫాను ముందు ‘నిశబ్ధం’ మాత్రమే అని భారీ డైలాగ్ పేల్చింది మంజరి. మరి రీఎంట్రీలో ఆమె ఎలాంటి తుఫాను సృష్టిస్తుందో చూడాలి.