దేశంలో ఉన్న చాలా చాలా పెద్ద పెద్ద స్కాలర్స్‌కి కూడా సాధ్యం కాని రీతిలో బికాంలో ఫిజిక్స్ చదవి అందరినీ షాక్‌కి గురిచేసిన టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒక్క ఇంటర్యూతోనే భయంకరమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ పబ్లిసిటీలో ఉన్న కిక్కు ఏంటో తెలిసిపోయినట్టుగా ఉంది. ఇక బికాంలో ఫిజిక్స్ చదివాను లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ని చాలా చాలా ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు జలీల్‌ఖాన్. చంద్రబాబుకు భయంకరమైన భజన చేయాలన్న జలీల్ ఖాన్ తాపత్రయం కూడా అందుకు కారణమవుతోంది. తాజాగా రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల గురించి మాట్లాడేశాడు జలీల్ ఖాన్. చంద్రబాబు నాయుడుకి వచ్చే ఐడియాలు ఇంకెవరికీ రావని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అడవిలో కూడా అసెంబ్లీని నిర్మించిన చంద్రబాబును ఎంత పొగిడినా తక్కువే అని చెప్పుకొచ్చాడు. నరేంద్రమోడీ కూడా చంద్రబాబు ముందు దిగదుడుపే అని తీసిపారేశాడు. టిడిపికి బిజెపి అవసరమే లేదని చెప్పుకొచ్చాడు. బిజెపితో ఉండాల్సిన అవసరమే లేదని తేల్చిపడేశాడు.
ఇక తన గొప్పదనం గురించి కూడా చెప్పుకొచ్చాడు జలీల్ ఖాన్. ఎన్నికలంటే తనకు అస్సలు భయమే లేదని….ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినా కూడా నేనే గెలుస్తానని ప్రగల్భాలు పలికేశాడు. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే పవన్‌పైన ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తాడో కూడా చెప్పేశాడు ఈ టిడిపి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్‌పై పది ఓట్ల తేడాతో గెలిచేస్తాడట ఈ బికాంలో ఫిజిక్స్ చదివిన మేధావి. చంద్రబాబుకు భజన చేసే ప్రయత్నంలో విచక్షణ కోల్పోతున్నట్టున్నాడు జలీల్ ఖాన్. జలీల్ ఖాన్ భజన కూడా చంద్రబాబుకు మేలు చేయకపోగా చెడు చేసేలా ఉంది. అసలే ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో మోడీకంటే చంద్రబాబు గ్రేట్. చంద్రబాబు ముందు మోడీ కూడా దిగదుడుపేలాంటి మాటలు టిడిపి ఎమ్మెల్యే నుంచి రావడం అంత మంచిది కాదేమో. అలాగే పవన్ కళ్యాణ్‌తో వైరాన్ని చంద్రబాబు అస్సలు కోరుకోవడం లేదు. అలాగే పవన్ కూడా చంద్రబాబు విషయంలో సంయమనం పాటిస్తున్నాడు. వాళ్ళిద్దరి సంబంధాలను అర్థం చేసుకోకుండా….పవన్ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టేలా జలీల్ ఖాన్ మాట్లాడేస్తున్నాడు. అది కాస్తా మొదటికే మోసం తెచ్చేలా ఉంది. మొత్తంగా చూస్తే జలీల్ ఖాన్ లాంటి మేధావి పొగడ్తలు కూడా భారీగానే నష్టం చేసేలా కనిపిస్తోంది. అయినా ఇన్ని మాటలు చెప్పిన ది గ్రేట్ జలీల్ ఖాన్……వైసిపి తరపున వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగొచ్చుగా. హీరోయిజం అంతా మాటల్లోనే చూపించాలా? కాస్త చేతల్లో కూడా ఉంటే బాగుంటుందిగా. ఈ జలీల్ ఖాన్వారు బికాంలో ఫిజిక్స్ చదివిన మేధావే కాదు……ఉత్తర కుమారుడికి సిసలైన వారసుడిలాగా కూడా ఉన్నాడే.