బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో ,ముఖ్యంగా యూత్ లో పాపులారిటి తెచ్చుకున్న జలీల్‌ఖాన్ గారు ఈ రోజు ఇంకో చమక్కు వదిలారు. ఆమరావతిలో నూతన అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ను ఎమ్మెల్యే రోజా ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించారు. ఈ లోపు రోజాతో పాటు వైసీపీకి చెందిన మిగతా మహిళా ఎమ్మెల్యేలు కూడా అక్కడకు వచ్చారు. ‘‘మేము నానా రాద్ధాంతాలు చేసినా, మాపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేసినా మాకు మీ అంత పాపులారిటీ రాలేదు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని మీరు చెప్పగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది’’ అంటూ ఛలోక్తులు విసిరారు.
‘‘అందరిలాగా స్ట్రయిట్‌గా చెబితే మనకు మనల్ని ఎవరూ గుర్తించరు. ఇలా ఉల్టాగా చెబితేనే మన గురించి అందరూ మాట్లాడుకుంటారు’’ అంటూ జలీల్‌ఖాన్ బదులిచ్చారు అంట అక్కడికి అదేదో తాను కావాలని అలా బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పినట్టు… బాగా కవర్ డ్రైవ్ ఆడాడు కదూ…ఇంకెన్ని చిత్రాలు చూడాలో జలీల్ ఖాన్ నుంచి !