మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా వారం కూడా గడవలేదు అప్పుడే వార్తల్లో హెడ్ లైన్ అయ్యారు శివాజీరాజా. తాజగా శివాజీరాజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా వున్నాయి. శివాజీరాజా సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా వున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ వేడుకలో మాట్లాడుతూ సినిమాల పై నోరు జారేశారు. ”దురదృష్టం కొద్ది సెన్సార్ బోర్డు లో వున్నా. ఈ రోజు ఒక సినిమా చూసాను. నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు. అంత దరిద్రపుగొట్టు సినిమా నేను ఇప్పటివరకూ చూడలేదు. ఏంటో అర్ధం కాదు. చిన్న చిన్న కెమరాలతో సినిమా తీస్తున్నారు. అర్ధం పర్ధం లేదు. సెన్సార్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తే భయం వేస్తుంది. ఎలాంటి సినిమా చూడాల్సివస్తుందో అని. సినిమా చూడటం లేదు. ఏంటీ కర్మ అంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నాం. దయచేసి మంచి సినిమాలు తీయండి. తెలుగు సినిమా గౌరవాన్ని నిలపండి” అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు శివాజీరాజా.
ఇప్పుడు ఈ మాటలలే వివాదాన్ని తెచ్చిపెట్టాయి. మంచి సినిమాలు తీయండి. తెలుగు సినిమా గౌరవాన్ని నిలపండి అనే ఫైనల్ కొటేషన్ బావున్నా.. మిగతా మాటలన్నీ సమంజసంగా లేవు అనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. దురదృష్టం కొద్ది సెన్సార్ బోర్డు లో వున్నాం అనడం తప్పు. ఎవరూ అక్కడ బలవంతగా వుండరు. నచ్చకపొతే రాజీనామ చేసి బయటికి రావచ్చు. అదే కాదు సెన్సార్ ముందుకు అన్ని సినిమాలూ వస్తాయి. దాన్ని సెన్సార్ చేయడమే బోర్డు సభ్యుల పని. అంతేకాని ఒక సినిమా బాలేదు అని చెప్పే అధికారం వుండదు. ఆ పదవిలో వుండి అలాంటి కామెంట్ చేయడం నైతికత అనిపించుకోదు. ఈ విషయం ఆయనకి తెలియదని కాదు. మరి ఎందుకో నోరు జారేశారు. బహుసా మా అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆనందంలో ఎక్సయిట్ మెంట్ తట్టుకోలేక ఇలా హైపర్ అయ్యారేమో శివాజీరాజా. ఇది వరకూ ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుంటే పెద్ద మేటర్ కాదేమో.. కానీ ఇప్పుడు ఆయన మా అధ్యక్షుడిగా వున్నారు. ఆ భాద్యత తెలుసుకొని మసలుకొనే అవసరం వుంది.