ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళల గొప్పదనాన్ని కీర్తిస్తూ అభినందనల జల్లు కురుస్తోంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అభినందనలు చాటుతున్నారు. టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు కూడా మహిళా దినోత్సవం శుభాక్షంలు అదించారు. ”బీ బ్యూటిఫుల్, బీ లవ్డ్, బీ రిస్పెక్టెడ్, బీ ప్రౌడ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు మహేష్. అంతేకాదు ఒక స్పెషల్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అమ్మ ఇందిరా, గారాలపట్టి సితార ఫోటోలను పక్క పక్కనే వుంచి ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అని పోస్ట్ చేశారు మహేష్. పక్క అక్కనే ఈ ఫోటో చూసే సరికి ”సితార పాప.. నాన్నమ్మ కలర్ జిరాక్స్ సార్” అంటూ రీట్వీట్లు చేస్తున్న్నారు అభిమానులు. నిజమే.. ఆ ఫోటో చుస్తే అచ్చు నాన్నమ్మ పోలికలతో దిగిపోయినట్లు కనిపిస్తుంది సితార.
ఇక మహేష్ సినిమాల విషయానికి ప్రస్తుతం మురగదాస్ సినిమాతో బిజీగా వున్నారు మహేష్. మహేష్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో రుపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. హ్యారీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#InternationalWomensDay pic.twitter.com/zswCIIKlgK
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2017