టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చేసింది. రాష్ట్రపతితో సహా దేశంలో ఉన్న నాయకులందరినీ కలిసి పరిటాల రవిని చంపంచింది వైఎస్ రాజశేఖరరెడ్డే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నోరు విప్పాలి. జేసీ దివాకర్‌రెడ్డితో చేతులు కలిపి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు పరిటాల రవిని చంపించేశారని ఆరోపణలు చేసిన పరిటాల సునీత, టిడిపి నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిందే. కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసమే, వైఎస్‌ల పైన హంతకులు అన్న ముద్ర వేయడానికే ఆ ప్రచారం చేశారా? లేక నిజంగానే పరిటాల రవి హత్యలో జేసీలు, వైఎస్‌ల హస్తం ఉందా? అనే విషయంపై ఇప్పుడు మాట్లాడే ధైర్యం చంద్రబాబుకి, పరిటాల సునీతకు ఉందా?
చంద్రబాబు అండ్ కో చేసిన తీవ్రమైన ఆరపణలన్నింటినీ ఓ టిడిపి ఎమ్మెల్యేనే ఖండిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు బాగా సన్నిహితులైపోయిన జేసీలే పరిటాల రవి హత్యతో వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ జగన్‌కి సంబంధం లేదని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డినే వైఎస్‌లకు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మరి ఇప్పుడు అధికారంలో కూడా ఉన్న చంద్రబాబు పరిటాల రవి హత్య గురించి ఎలా స్పందిస్తాడో చూడాలి. జేసీ ప్రభాకరరెడ్డి మాటలకు చంద్రబాబు అండ్ కో నుంచి ఎలాంటి స్పందనా రాకపోతే మాత్రం పరిటాల రవి హత్యను రాజకీయంగా వాడుకోవడానికి టిడిపి జనాలు ప్రయత్నించారన్న ఆరోపణలు నిజమని నమ్మాల్సి ఉంటుంది. పరిటాల రవి చనిపోయినప్పుడు టిడిపి వాళ్ళు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సామాన్య జనాలను కూడా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆవేధనతో చేశారని బదులిచ్చారు. మరి ఇప్పుడు జేసీ మాటలు వింటుంటే చంద్రబాబుకు, పరిటాల సునీతకు ఆవేదన కలగడం లేదా? కేంద్రంలో మిత్ర పక్షం బిజెపి, రాష్ట్రంలో చంద్రబాబే అధికారంలో ఉన్న నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యేను హత్య చేయించినవాళ్ళని చెప్పి టిడిపి నేతలు ఆరోపణలు చేసిన జగన్, జేసీలను ఎందుకు శిక్షించడం లేదు? వాళ్ళపైన విచారణ ఎందుకు జరగడం లేదు? పరిటాల రవి హత్యను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా చేసి, బోలెడంత హంగామా చేసిన చంద్రబాబుకు ఇప్పుడు పరిటాల రవి హత్య గురించి మాట్లాడే ధైర్యం ఉందా?