వెండితెర అప్సరస అనుష్క. అందం, అభినమయంతో ప్రేక్షకుల మదిని హోల్ సెల్ గా దోచేసింది స్వీటీ. జేజమ్మా అంటూ కత్తి పట్టినా… బిల్లా అంటూ బికినీ అందాలతో అదరగొట్టినా అనుష్కకే చెల్లింది. అయితే అలాంటి అనుష్కను ముసలమ్మలా తయారు చేశాడు రాజమౌళి. బాహుబలి కోసం. బాహుబలి సృస్టించిన చరిత్ర సంగతి పక్కన పెడితే.. బాహుబలిలో అనుష్క చూసిన ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. ఇందులో చెరశాలలో బంధీగా కనిపించింది అనుష్క. కాస్త మిడిల్ ఏజ్ క్యారెక్టర్. అయితే భయంకరమైన మేకప్ వేశారు. ఆ మేకప్ చూసి జనాలు దడుసుకున్నారు. క్యారెక్టర్ ని మిడిల్ ఏజ్ లో చూపించాలంటే మరీ అంత భయంకరమైన మేకప్ వేయాల్సిన అవసరం లేదు. కాస్త సహజంగా చూపించే అవకాశం వుంది కదా అంటూ విమర్శలు వచ్చాయి. టోటల్ గా బాహుబలిలో ముసలి అనుష్కతోనే సరిపెట్టేశారు.
ఇప్పుడు బాహుబలి పార్ట్ 2రెడీ అవుతోంది. ఒకొక్క పోస్టర్ బయటికివస్తోంది. ఇదివరకే అనుష్క సంబధించిన యంగ్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఇందులో అనుష్క ను టెక్నాలజీ వాడి సన్నగా చూపించారు. ఇప్పుడు మరో పోస్టర్ వచ్చింది. మళ్ళీ ఓల్డ్ అనుష్క ను చూపించారు. ఇందులో ఆ ఓల్డ్ గెటప్ మరీ భయంకరంగా వుంది. అది చాల నట్టు తలపై నిప్పు కుంపటి ఒకటి పెట్టారు. అది ఎడిటింగ్ చేసి పెట్టారని ఈజీగా అర్ధమైపోతుంది. ఈ పోస్టర్ లో దాదాపు పార్ట్1ముఖాలే కనిపించాయి. అయితే అనుష్క కు మరింత ఆడ్ మేకప్ వేశారని చెప్పొచ్చు. మరి కొద్దిరోజుల్లో ట్రైలర్ బయటికి వస్తుంది. మరి ఇందులోనైనా అనుష్క అభిమానులు కోరుకునే మెరుపులు కనిపిస్తాయో లేదో చూడాలి.