రిమేక్ సినిమా చేయడం అంత ఈజీ కాదు. తెలిసిన కధే, ఆల్రెడీ చూసిన సీన్సే కదా అనుకోవచ్చు. కాని అనుకున్నంత సులువు కాదు రీమేక్ సినిమా తీసి మెప్పించడం. ఒక సినిమా ఎందుకు హిట్ అయ్యింది ? ఆ సినిమాలో జీవం ఎక్కడుంది ? ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ అయ్యారు? సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటి ? ఇలా బోలెడు అంశాలను పరిగణలో తీసుకోవాలి. నేటివిటికి తగ్గట్టు కధను, సన్నీవేషాలను మార్చుకోవాలి. అప్పుడే రీమేక్ సినిమా నిలబడుతుంది. అలా కాకుండా వున్నది వున్నట్లు తీసి పారేసే సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో చెప్పడానికి చాలా ఉదాహరణలు వున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో మరో రీమేక్ సినిమా రెడీ అవుతుంది. అదే ‘’బాబు బాగా బిజీ’’. బాలీవుడ్ లో ఎరోటిక్ కామెడిగా వచ్చిన హంటర్ సినిమాకు రిమేక్ ఇది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాజగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ బయటికివచ్చింది. పోస్టర్ లో క్రియేటివిటి ఏమిటి చూపించలేదు. బాలీవుడ్ పోస్టర్ నే దించారు. చివరికి కలర్ స్కీం కూడా మార్చలేదు. యాజిటిజ్ గా హుంటర్ లుక్ నే వాడుకున్నారు.
ఇది తప్పని కాదు. జనరల్ గా రీమేక్ సినిమా అన్నప్పుడు కనీసం పోస్టర్లో లో మార్పులు కనిపిస్తుంటాయి. కాని బాబు టీం మాత్రం వున్నది వున్నట్లుగా వాడుకుంది. అడల్ట్ కంటెన్ వున్న వున్న సినిమా ఇది. సాధ్యమైనంత వరకూ దాన్ని వాడేయాలని ఫిక్స్ అయిపోయినట్లు వున్నారు. మరి, ఈ కంటెంట్ ఇక్కడ ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో తెలియాలంటే బాబు థియేటర్లోకి రావాల్సిందే. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.