నందమూరి బాలకృష్ణను గౌతమీ పుత్ర శాతకర్ణిగా చూపించారు క్రిష్. ఇది అద్భుత విజయం సాధించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా అర్థం చేసుకొన్న దర్శకుల్లో క్రిష్ పేరూ చేరింది. ఈ సినిమా తర్వాత క్రిష్ నుండి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు . వెంకటేష్, క్రిష్ కలయికలో ఓ సినిమా ప్లాన్ జరిగింది. వెంకీ కోసం క్రిష్ ఓ నవలని సినిమాగా తీద్దామని భావించారు. ఆ నవల పేరు… ‘అతడు అడవిని జయించాడు’. కేశవరెడ్డి రచించిన ఈ నవలకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ నవల కాపీ రైట్స్ తీసుకోవాలని అనుకున్నారు క్రిష్. కానీ ఇంతలోనే మరో వ్యక్తి ఆ నవల హక్కులను సొంతం చేసుకోవడంతో వెంకీ సినిమా డ్రాప్ అయింది.
అయితే తాజగా క్రిష్ తన బ్యానర్ పై ‘చోర’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ టైటిల్ ఎవరి కోసం రిజిస్టర్ చేయించారో ఇంకా క్లారిటీ రాలేదు. కళ్యాణ్ రామ్ తో క్రిష్ ఓ సినిమా చేస్తారని ఇటివల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహిస్తారా ? లేదా కేవలం కధ, నిర్మాణం మాత్రమే ఇస్తారా అన్న విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే చిరంజీవి కూడా ఇటివలే ఓ కధ చెప్పారు క్రిష్. చిరుకు కూడా ఈ కధ నచ్చిందని ఆయన కొన్ని మార్పులు సూచించారని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చోర టైటిల్ రిజిస్టర్ చేశారు క్రిష్. మరి ఈ టైటిల్ ఎవరి కోసం అన్నదానిపై క్లారిటీ రావాల్సివుంది. ”క్రిష్ దగ్గర ఓ కథ ఉంది.దానికి చోర అనే టైటిల్ బాగుంటుందనిపించింది. అందుకే ముందస్తుగా రిజిస్టర్ చేయించాం. హీరో ఎవరు? అదెప్పుడు తీస్తాం అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు” అని క్రిష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సో.. చిరు, కల్యాణ్‌రామ్ సినిమాలకు ఈ చోరకు ఎలాంటి సంబంధం లేదన్నమాట.