బాహుబలి 2 సంబరాలు మొదలైపోయాయి. రేపే (గురువారం) ట్రైలర్ రాబోతోంది. ఈనెల 26న ఆడియో ఫంక్షన్‌ని గ్రాండ్‌గా జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈలోగా బాహుబలి 2కి సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని సేకరిస్తోంది తెలుగు 360.కామ్. ఈ నేపథ్యంలో బాహుబలి 2కి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అందేంటంటే.. ఈ సినిమాలో అనుష్కకి సంబంధించిన సీన్లు రీషూట్ చేశార్ట. వివరాల్లోకి వెళ్తే…
బాహుబలి 1 సమయంలోనే పార్ట్ 2కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కించేశారు. పార్ట్ 2 లో అనుష్క కనిపించే సన్నివేశాల్లో దాదాపుగా 50 శాతం పార్ట్ 1 సమయంలోనే షూట్ చేసేశారు. అయితే ఆ సన్నివేశాలన్నీ రాజమౌళి పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. అవే సన్నివేశాల్ని కొత్తగా తెరకెక్కించార్ట. బాహుబలి ది బిగినింగ్ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించిన ఆ సీన్లు ఈసారి కేరళలో రీ షూట్ చేశార్ట. బాహుబలి 1కీ 2కీ మధ్య అనుష్క బాగా లావైంది. కొన్ని సన్నివేశాలలో సన్నగా, మరి కొన్ని సన్నివేశాల్లో లావుగా కనిపిస్తే.. టెంపో దెబ్బతింటుందని రాజమౌళి భావించాడట. అంతేకాదు.. పార్ట్ 1 సమయంలో తీసిన సీన్లు ఆ తరవాత తనకే నచ్చలేదని, అందుకే వాటికంటే బెటర్ సీన్లు రాసుకొని.. ఈసారి ఇంకా బాగా తెరకెక్కించాడని, రాజమౌళి శ్రమ ఫలించిందని, గతంలోకంటే ఈసారి అనుష్క సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ఈ సినిమాలో ఉన్న మేజర్ హైలెట్స్‌లో అనుష్కతో తెరకెక్కించిన సీన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.